Headlines

SBI: ఎస్బీఐ కొత్త రూల్స్.. నగదు విత్ డ్రా ఛార్జీల్లో మార్పులు.. ఇకపై ప్రతీ ట్రాన్సాక్షన్‌కు.. | SBI Basic Savings Account Rules Change From October 1: Cash Withdrawals Limited to 4 Free Transactions


మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బేసిక్ సేవింగ్స్ డిపాజిట్ అకౌంట్ వాడుతున్నారా..? అయితే అక్టోబర్ 1వ తేదీ నుంచి నిబంధనలు మారనున్నాయి. మీరు బ్యాంక్ అకౌంట్ నుంచి నగదు ఉపసంహరించుకోవాలని అనుకుంటుంటే.. ఈ కొత్త రూల్స్ గురించి తెలుసుకోవాల్సిందే. ఈ మేరకు సేవా ఛార్జీలలో ఎస్బీఐ మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇక నుంచి నెలలో నాలుగుసార్లు మాత్రమే నగదును ఉచితంగా ఉపసంహరించుకోవచ్చు. ఆ పరిమితిని మించి చేసుకోవాలంటే రుసుంలు చెల్లించాల్సిందే. నాలుగు లావాదేవీల తర్వాత ప్రతీ లావాదేవీకి రూ.15+జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. బ్రాంచ్, ఏటీఎం, మైక్రో ఏటీఎం, ఏఈపీఎస్, క్యాష్@పీఓఎస్ పద్దతుల ద్వారా చేసే నగదు లావాదేవీలు అన్నీ కలిపి నెలకు నాలుగు మాత్రమే ఉచితంగా నిర్వహించుకోవచ్చు. ఆపైన చేసే లావాదేవీలకు మాత్రమే ఛార్జీలు వర్తిస్తాయని ఆర్బీఐ స్పష్టం చేసింది.

ఈ లావాాదేవీలు ఉచితమే..

యూపీఐ, ఐఎంపీఎస్, నెఫ్ట్, ఆర్టీజీఎస్, పీఓఎస్ ద్వారా చేసే ట్రాన్సాక్షన్లు ఎప్పటిలాగే ఉచితంగా కొనసాగుతాయని ఎస్బీఐ తెలిపింది. దీంతో వినియోగదారులు దీనిని గమనించాలని కోరింది. ఇక డిజిటల్ లావాదేవీలు మాత్రం ఎప్పటిలాగే ఉచితంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఇక ఈ అకౌంట్ ఉన్నవారు ఉపయోగించే రూపే ఏటీఎం కమ్ డెబిట్ కార్డ్ వంటి పలు సేవల సర్వీస్ ఛార్జీల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో ఈ కార్డును ఉచితంగానే అందించడంతో పాటు ఎలాంటి వార్షిక ఫీజులు వసూలు చేయరు. ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే చెక్కులను డిపాజిట్ చేయడానికి లేదా స్వీకరించడానికి, ఇనాక్టివ్ అయిన అకౌంట్లను యాక్టివ్ చేసుకోవడానికి, అకౌంట్‌ను మూసివేయడానికి ఎటువంటి ఛార్జీలు ఉండవు.

ఎస్బీఐ బేసిక్ సేవింగ్స్ అకౌంట్ ఎలా తెరవాలి..?

ఎస్బీఐ బ్రాంచులకు వెళ్లి సులువుగా ఈ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. అవసరమైన కేవైసీ పత్రాలు సమర్పించి తెరవాల్సి ఉంటుంది. ఒంటరిగా లేదా ఉమ్మడి ఖాతాను అయినా ఓపెన్ చేయవచ్చు. కొత్త బేసిక్ సేవింగ్స్ అకౌంట్ తెరవడానికి లేదా ఇప్పటికే ఉన్న పొదుపు ఖాతాను బేసిక్ సేవింగ్స్ అకౌంట్‌గా మార్చడానికి.. ఇప్పటివరకు ఏ బ్యాంకులో బేసిక్ సేవింగ్స్ అకౌంట్ కలిగి ఉండకూడదు. ఇక అకౌంట్‌లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయపోయినా ఛార్జీవు పడవు. గరిష్టంగా ఎంత అయినా నగదు దాచుకోవచ్చు. అర్హత గల ఖాతాదారులు ప్రతి సంవత్సరం ఉచితంగా 2 5లీఫ్ చెక్ బుక్‌ను కూడా పొందవచ్చు. ఎలాంటి ఛార్జీలు పడకుండా రోజువారీ అవసరాల కోసం అకౌంట్ కావాలనుకునేవారికి ఈ అకౌంట్ ఉపయోగపడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *