Headlines

టెస్ట్‌లకు పనికిరావంటూ గెంటేశారు.. కట్‌చేస్తే.. 2 ప్రపంచకప్‌లతో మెరిసిన టీమిండియా తోపు..! | Arshdeep singh test debut wait duleep trophy hero


Arshdeep Singh Test Debut: టీమిండియా ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ దులీప్ ట్రోఫీలో దుమ్మురేపుతున్నాడు. వెస్ట్ జోన్‌పై నార్త్ జోన్ సాధించిన విజయంలో బంతితో కీలక పాత్ర పోషించిన అర్ష్‌దీప్ 4 వికెట్లు పడగొట్టాడు. ఇలాంటి టోర్నమెంట్లలో పాల్గొనడం ద్వారా, టెస్ట్ క్రికెట్‌కు అవసరమైన నైపుణ్యాలు, స్టామినా తనలో ఉన్నాయని నిరూపించుకోవాలనుకుంటున్నట్లు అర్ష్‌దీప్ చెప్పుకొచ్చాడు.

టెస్ట్ అరంగేట్రం చేయలే..

టీమిండియా తరపున 18 వన్డేలు, 91 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అర్ష్‌దీప్, ఇప్పటికీ తన టెస్ట్ అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్నాడు. అతను వైట్-బాల్ క్రికెట్‌పైనే ఎక్కువగా దృష్టి పెట్టడం వల్ల, రెడ్-బాల్ మ్యాచ్‌లలో అతనికి అవకాశాలు తక్కువగా లభించాయి. దీంతో, తన 22వ, 23వ ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల మధ్య దాదాపు ఒక సంవత్సరం పాటు వేచి ఉండాల్సి వచ్చింది.

ఎక్కువమంది చదివినది: IPL 2027: ముగిసిన హార్దిక్ ట్రేడింగ్.. బలిపశువుల్లా ఆ ఇద్దరు.. ఏ టీంలో చేరనున్నాడంటే?

ఇవి కూడా చదవండి



దులీప్ ట్రోఫీలో అద్భుతమైన ప్రదర్శన..

బెంగళూరులో వెస్ట్ జోన్‌తో జరిగిన దులీప్ ట్రోఫీ క్వార్టర్-ఫైనల్ అర్ష్‌దీప్‌కు ఒక కీలక పరీక్షగా నిలిచింది. అతను రెండు ఇన్నింగ్స్‌లలోనూ నిలకడగా అద్భుతంగా బౌలింగ్ చేసి, 3/53, 1/40 గణాంకాలను నమోదు చేశాడు. దీంతో నార్త్ జోన్ 52 పరుగుల తేడాతో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. క్రిక్‌ఇన్ఫోతో అర్షదీప్ మాట్లాడుతూ “నాకు రెడ్-బాల్ క్రికెట్ ఆడే అవకాశం చాలా అరుదుగా వస్తుంది, ఇది అలాంటి అవకాశాలలో ఒకటి. నా సామర్థ్యాలను ప్రదర్శించి, నేను ఎన్ని ఓవర్లు బౌలింగ్ చేయగలనో చూడాలనుకున్నాను. నేను మంచి లయలో ఉన్నాను. నేను రెడ్-బాల్ గేమ్ ఆడి చాలా కాలం అయింది. నేను ప్రాక్టీస్‌లో చాలా సమయం గడిపాను, అది మంచి ఫలితాన్నిచ్చింది. ఒంటి నొప్పులు కొన్ని ఉన్నాయి, కానీ మనం గెలిచాం కాబట్టి అవి మంచి నొప్పులే” అంటూ చెప్పుకొచ్చాడు.

టోర్నమెంట్‌కు ముందు శిక్షణ..

ఇటీవల ఎక్కువగా వైట్-బాల్ క్రికెట్ ఆడిన తాను, టోర్నమెంట్‌కు ముందు తన శిక్షణా పద్ధతిని మార్చుకుని, రెడ్-బాల్ బౌలింగ్‌పై దృష్టి పెట్టడం ప్రారంభించినట్లు తెలిపాడు. అర్షదీప్ మాట్లాడుతూ.. “ఈసారి దులీప్ ట్రోఫీ రాబోతోందని నాకు తెలుసు, అందుకే నేను రెడ్ బాల్‌తో ప్రాక్టీస్ చేశాను. వైట్-బాల్ సీజన్ సమీపిస్తున్న తరుణంలో, వైట్ బాల్‌తోనే ప్రాక్టీస్ చేశాను. సీజన్‌కు అనుగుణంగా ఇది చాలా ప్రత్యేకమైన శిక్షణ” అంటూ చెప్పుకొచ్చాడు.

ఎక్కువమంది చదివినది: ఎవర్రా మీరు.. నో బాల్ కాదు.. వైడ్ కూడా కాదు.. కట్‌చేస్తే.. ఒకే బంతికి ఏకంగా 7 పరుగులు..!

కౌంటీలో కూడా..

అర్ష్‌దీప్ గతంలో కౌంటీ క్రికెట్ ఆడాడు. 2023లో కెంట్ తరపున 5 మ్యాచ్‌లు ఆడాడు. ఇంగ్లాండ్‌లో రెడ్-బాల్ క్రికెట్ ఆడిన అనుభవం చాలా ఉపయోగపడుతుందని అతను భావిస్తున్నాడు. కానీ టీమిండియా బిజీ షెడ్యూల్ కారణంగా మళ్లీ కౌంటీ క్రికెట్ ఆడటం కష్టంగా ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *