Headlines

హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్.. ఆ మార్గంలో మూసి వరద కష్టాలకు చెక్.. ఇక ప్రయాణం సులభం.. | Moosarambagh High Level Bridge Inauguration Today on Moosi River: Traffic Relief for Amberpet and Nearby Areas


హైదరాబాద్‌ ముసారంబాగ్‌లో ఇక వరద కష్టాలకు ఇక చెక్ పడనుంది.. మూసారంబాగ్ బ్రిడ్జి ఇవ్వా్ల్టి నుంచి పూర్తిగా అందుబాటులోకి రానుంది.. సోమవారం మూసారంబాగ్ వంతెనను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. 52 కోట్ల రూపాయలతో 400 మీటర్ల పొడవున బ్రిడ్జి నిర్మించారు. వంతెన వెడల్పు 14.5 మీటర్లు కాగా, పాదచారుల కోసం 3.5 మీటర్ల వెడల్పుతో ఫుట్‌పాత్‌ ఏర్పాటు చేశారు. ఈ బ్రిడ్జ్ నిర్మాణంతో అంబర్‌పేట్‌–మూసారాంబాగ్‌ మధ్య ఏడాది పొడవునా రాకపోకలకు వీలు కలగనుంది. ముఖ్యంగా వర్షాకాలంలో మూసీ నదికి వరదలు వచ్చినప్పుడు ఏర్పడే నీటి ముంపు, రాకపోకల అంతరాయానికి శాశ్వత పరిష్కారం లభించనుంది. దీంతో రెండు ప్రాంతాల మధ్య రవాణా సౌకర్యం మెరుగుపడి, ప్రజలకు సురక్షితమైన, నిరంతరాయమైన ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రానుంది. వాస్తవానికి ఈ బ్రిడ్జి చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. మూసారాంబాగ్‌ దగ్గర మూసీ నదిపై వంతెనల నిర్మాణానికి ప్రభుత్వం 2022లో పరిపాలనా అనుమతి మంజూరు చేసింది. అనంతరం పనులు పూర్తి కాగా.. ఎట్టకేలకు ఇవాళ ప్రారంభానికి సిద్ధమైంది.

ఈ బ్రిడ్జ్‌ను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తనిఖీ చేశారు. ప్రారంభోత్సవ ఏర్పాట్ల గురించి అధికారులతో ఆరా తీశారు. చంచల్ గూడ ఫ్లైఓవర్ దగ్గర, ప్రధాన ఫ్లైఓవర్ పూర్తయింది, దీని ప్రారంభోత్సవానికి మార్గం సుగమం చేయాలని అధికారులకు సూచించారు కమిషనర్. చంపాపేట్ వైపు వెళ్లే ఏ3 సైడ్ ర్యాంప్‌ను రెండు మూడు రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈ ప్రాంతాలకు ప్రయాణం సులభం

ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చిన వస్తే చంచల్‌గూడ, సైదాబాద్, సంతోష్ నగర్, ఐఎస్ సదన్, ఒవైసీ హాస్పిటల్, కంచన్ బాగ్, చంపాపేట్, సాగర్ రోడ్ వైపు వెళ్లాలనుకునే ప్రయాణికులకు ప్రయాణం సులభం అవుతుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *