Headlines

కన్న తండ్రిపై కొడుకుల పైశాచికత్వం..! నడిరోడ్డుపైనే కర్రలతో దాడి..


కన్న తండ్రిపై కొడుకుల పైశాచికత్వం..! నడిరోడ్డుపైనే కర్రలతో దాడి..

మహారాష్ట్రలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భూమి విక్రయానికి సంబంధించిన వివాదంతో 65 ఏళ్ల వృద్ధ తండ్రిపై ఇద్దరు కుమారులు నడిరోడ్డుపైనే కర్రలతో దాడి చేశారు. ఈ ఘటన ఇందాపూర్ పట్టణ సమీపంలోని సలీమ్ లాన్స్ ప్రాంతంలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుకారాం కిసన్ రౌత్ తన ఇద్దరు కుమారులు సంజయ్ తుకారాం రౌత్, రాజేంద్ర తుకారాం రౌత్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భార్య అంజనా రౌత్ పేరుతో ఉన్న భూమిని విక్రయించిన విషయమై కుమారులు తండ్రిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మాటామాటా పెరిగి వివాదం తీవ్రరూపం దాల్చింది. ఇద్దరు కుమారులు కలిసి తండ్రిపై కర్రలతో దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. నడిరోడ్డుపై వృద్ధుడిని కొడుతున్న దృశ్యాలను పలువురు వీడియో తీసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

తండ్రి తుకారం ఫిర్యాదు ఆధారంగా ఇద్దరు కుమారులపై కేసు నమోదు చేసిన ఇందాపూర్ పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. భూమి విక్రయానికి సంబంధించిన వివాదమే దాడికి కారణమా? ఇతర అంశాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

 

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *