Headlines

OTT Movie: థియేటర్లలో బ్యాన్.. కట్ చేస్తే అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అవార్డులు.. ఆపై ఓటీటీలోనూ సంచలనం | Bollywood controversy film Unfreedom banned in India now available on Netflix OTT


ఇటీవల కొన్ని సినిమాలు విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంటున్నాయి. సినిమాల్లోని కొన్ని సన్నివేశాలు లేదా సంభాషణల విషయంలో కొన్ని సంస్థలు ఈ చిత్రాలను వ్యతిరేకించడంతో అవి థియేటర్లలో విడుదల కావడం లేదు. అలాగే బోల్డ్ కంటెంట్ కారణంగా కూడా కొన్ని సినిమాలు విడుదల కాలేదు. అయితే, ఈ చిత్రాలు ప్రస్తుతం ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి. ప్రేక్షకులు కూడా ఈ చిత్రాలను ఓటీటీలో చూసేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అలా థియేటర్లలో నిషేధానికి గురై ఓటీటీలో సంచలనం సృష్టంచిన సినిమా ‘అన్‌ఫ్రీడమ్’. బాలీవుడ్ దర్శకుడు రాజ్ అమిత్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమాలో ఉగ్రవాదం, మత ఛాందసవాదం, స్వలింగ సంపర్కం, ప్రేమ, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి సున్నితమైన అంశాలు ఉన్నాయి. దీంతో 2015లో ఈ చిత్రానికి భారతదేశంలో థియేటర్లలో విడుదలకు ఆమోదం లభించలేదు. ‘అన్‌ఫ్రీడమ్’ సినిమా కథ వివిధ పాత్రల జీవితాల చుట్టూ తిరుగుతుంది. ఒకవైపు ఇది ఉగ్రవాదం, మత ఛాందసవాదం వంటి సమస్యలను ప్రస్తావిస్తూనే, మరోవైపు తమ సొంత గుర్తింపు, ప్రేమ, తాము కోరుకున్నట్లుగా జీవించే హక్కు కోసం పోరాడుతున్న వ్యక్తుల కథను ఆవిష్కరిస్తుంది.

‘అన్‌ఫ్రీడమ్’ చిత్రాన్ని భారతదేశంలో విడుదల కోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)కి సమర్పించారు. అయితే, చిత్రంలోని కొన్ని సన్నివేశాలు, సున్నితమైన అంశాలపై బోర్డు అభ్యంతరం తెలిపి, పలు మార్పులను సూచించింది. స్వలింగ సంపర్కానికి సంబంధించిన డైలాగులు, శృంగార సన్నివేశాలు, అలాగే ఉగ్రవాదానికి సంబంధించిన కొన్ని సీన్లు, డైలాగులను తొలగించాలని సెన్సార్ బోర్డ్ సూచించింది. అయితే నిర్మాతలు మాత్రం సెన్సార్ బోర్డు సూచించిన మార్పులు చేయడానికి నిరాకరించారు. సన్నివేశాలను లేదా కంటెంట్‌ను మార్చడం వల్ల సినిమా అంతా ఎఫెక్టివ్ గా ఉండదని దర్శక నిర్మాతలు భావించారు.
దీని తర్వాత, చిత్ర బృందం సెన్సార్ బోర్డు నిర్ణయానికి వ్యతిరేకంగా అప్పీల్ చేసింది. అయినప్పటికీ, ‘అన్‌ఫ్రీడమ్’ చిత్రాన్ని భారతదేశంలోని థియేటర్లలో విడుదల చేయడానికి అనుమతించలేదు.

భారతదేశంలో విడుదల కానప్పటికీ ‘అన్‌ఫ్రీడమ్’ అంతర్జాతీయంగా పలు సినిమా ఈవెంట్లు, ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ ఫెస్టివల్స్ లోనూ ప్రదర్శితమైంది. పలు సున్నితమైన అంశాలను చూపించిన తీరుకు పలు ప్రశంసలు, అవార్డులు కూడా వచ్చాయి. సెన్సార్‌షిప్, భావ ప్రకటనా స్వేచ్ఛ, భారతీయ సినిమాలో సున్నితమైన అంశాల చిత్రీకరణపై చర్చలను రేకెత్తించిన చిత్రాలలో ‘అన్‌ఫ్రీడమ్’ సినిమాను ఒకటిగా పరిగణిస్తారు. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *