టాలీవుడ్లోనే కాదు సౌత్ ఇండస్ట్రీలో పెద్ద మాఫియానే నడుస్తుందిప్పుడు. మాఫియా అంటే మీరనుకునేది కాదు.. శ్రీమంతుడులో మహేష్ చెప్పినట్లు అదోరకం. తెరవెనక మాఫియా కాదు ఇది తెరపై మాఫియా గురించే మనం మాట్లాడుకునేది. హీరో ఎవరైనా.. గ్యాంగ్ స్టర్ డ్రామాల వైపే అడుగులేస్తున్నారు. ఉన్నట్లుండి ఈ మాఫియా కథలకు డిమాండ్ ఎందుకొచ్చింది..? సౌత్‌లో మాఫియా, గ్యాంగ్ స్టర్ కథలకు డిమాండ్ మళ్లీ పెరిగింది. బాబీ తెరకెక్కిస్తున్న కాకాలో డాన్‌గానే కనిపిస్తున్నారు చిరంజీవి. కోల్కత్తా బ్యాక్‌డ్రాప్‌లో వస్తుంది ఈ చిత్రం. అనస్వర రాజన్ చిరు కూతురుగా నటిస్తున్నారు. గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న దాదా సినిమాలో బాలయ్య ముంబై బేస్డ్ డాన్‌గా నటిస్తున్నారు. టీజర్‌తోనే సినిమాపై అంచనాలు పెంచేసారు మేకర్స్. గతంలో రానా, అశోక చక్రవర్తి, డిక్టేటర్ తర్వాత మరోసారి డాన్ అయ్యారు బాలయ్య. నాగార్జున నటిస్తున్న కింగ్ 100 కూడా మాఫియా బ్యాక్‌డ్రాప్‌లోనే వస్తుంది. రా.కార్తిక్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మధ్యే వడుదలైన టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. డిసెంబర్ 24న సినిమా విడుదల కానుంది. గతంలో డాన్, భాయ్ సినిమాల్లో మాఫియా లీడర్‌గా నటించారు నాగార్జున. తెలుగులోనే కాదు.. మిగిలిన భాషల్లో కూడా సీనియర్ హీరోలు మాఫియా బాటలోనే వెళ్తున్నారు. ధనుష్ హీరోగా నటిస్తున్న ఓం సినిమాలో మమ్ముట్టి మాఫియా డాన్‌గానే నటిస్తున్నారు. టీజర్‌తోనే మమ్మూక క్యారెక్టర్‌పై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. అలాగే మోహన్ లాల్ సైతం లూసీఫర్ ఫ్రాంచైజీలో మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్‌గా నటించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!
దుబాయ్‌లో సింగిల్ రూమ్ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!
పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు
హైదరాబాదీలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇక.. మెట్రో, ఆర్టీసీ ప్రయాణం మరింత సులభం!