Headlines

OTT Movie: ఓటీటీలో ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ చూశాక ఒంటరిగా పడుకోవాలంటే భయపడతారు.. తెలుగులోనూ స్ట్రీమింగ్ | Must Watch Crime Thriller: Vineeth And Meena Web Series Roslin Now Streaming On Jio Hotstar OTT


ఇండియాలో వచ్చిన ది బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల జాబితా తీస్తే అందులో దృశ్యం సిరీస్ సినిమాలు టాప్ లో ఉంటాయి. ఈ ఫ్రాంఛైజీలో వచ్చిన అన్ని సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. కేవలం మలయాళంలోనే కాదు తెలుగు, హిందీ, కన్నడం, తదితర భాషల్లోనూ దృశ్యం సినిమాలు రీమేకై ఆడియెన్స్ కు మంచి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ అందించాయి. మరి సస్పెన్స్ తో కట్టిపడేసే ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఆద్యుడు ఎవరంటే మలయాళం డైరెక్టర్ జీతూ జోసెఫ్ అని చెప్పవచ్చు. ఈ డైరెక్టర్ కేవలం దృశ్యం సినిమాలే పలు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లను కూడా తెరకెక్కించాడు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సిరీస్ కూడా జీతూ జోసెఫ్ నుంచి వచ్చిందే. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే కథా కథనాలు, ఉత్కంఠ రేపే సన్నివేశాలు, ఊహించని ట్విస్టులతో సాగే ఈ సిరీస్ ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్ కు మంచి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తోంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, , హిందీ, బెంగాళీ, మరాఠీ భాషల్లో ఈ సిరీస్ అందుబాటులో ఉండడం విశేషం. ఇక ఈ వెబ్ సిరీస్ స్టోరీ విషయానికి వస్తే.. ఓ 17 ఏళ్ల అమ్మాయి చుట్టూ ఈ కథ సాగుతుంది. ఆమెకు రాత్రిపూట భయంకరమైన కలలు వస్తుంటాయి. ఇదే క్రమంలో తన కలలో కనిపించే వ్యక్తి నిజంగానే తనను వెంబడిస్తున్నట్లు ఆమె ఫీల్ అవుతుంటుంది. అంతేకాదు ఆ వ్యక్తి తనను చంపాలని చూస్తున్నట్లు కూడా ఆమెకు కలలు వస్తుంటాయి. ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పినా పెద్దగా పట్టించుకోరు. అయితే ఓ రోజు అనుకోకుండా తన కలలో కనిపించే వ్యక్తి నేరుగా ఆ అమ్మాయి ఇంటికే అతిథిగా వస్తాడు.

మరి కలలో కనిపించిన వ్యక్తి ఇంటికి వచ్చాక ఆ అమ్మాయి జీవితం ఏమైంది? అసలు జరుగుతున్నదంతా నిజమేనా? ఆ అమ్మాయి చదువుతున్న ఒక బుక్ కారణంగానే ఇదంతా జరుగుతుందా? అసలు ఆ అమ్మాయి ఎవరు? ఇంటికి వచ్చిన అతిథి ఎవరు? చివరికీ ఏం తేలింది? అన్నది తెలుసుకోవాలంటే ఈ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ చూడాల్సిందే. డైరెక్టర్ సుమేష్ నందకుమార్ దర్శకత్వంలో దృశ్యం డైరెక్టర్ జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ఈ సిరీస్ పేరు రోస్లిన్. సీనియర్ హీరో, హీరోయిన్లు వినీత్ , మీనా ఇందులో భార్యాభర్తలుగా నటించారు. అలాగే సంజనా దీపు మరో కీలక పాత్రలో ఆకట్టుకుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లో మొత్తం 6 ఎపిసోడ్‌లు ఉన్నాయి. ప్రతి ఎపిసోడ్ సుమారు 25-35 నిమిషాల నిడివి ఉంటుంది. . ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. ఉహకందని ట్విస్టులతో సాగే ఈ రోస్లిన్ వెబ్ సిరీస్ థ్రిల్లర్ జోనర్ ఇష్టపడేవాళ్ళకి మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.

రోస్లిన్ వెబ్ సిరీస్ ట్రైలర్..



ఇవి కూడా చదవండి



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *