Headlines

OTT Movie: భూమిపైకి ఏలియన్స్ వస్తే.. ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ | Hollywood Science Fiction Thriller Disclosure Day Movie Is Streaming Now On Amazon Prime Video OTT

OTT Movie: భూమిపైకి ఏలియన్స్ వస్తే.. ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ | Hollywood Science Fiction Thriller Disclosure Day Movie Is Streaming Now On Amazon Prime Video OTT


హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్‌బర్గ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇంగ్లిష్ లో సైన్స్ ఫిక్షన్ సినిమాలకు ఆయన కేరాఫ్ అడ్రస్. తెలుగు ఆడియెన్స్ కూడా ఈ డైరెక్టర్ సినిమాలు తెగ చూసేస్తారు. జురాసిక్ పార్క్, క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్, మ్యూనిచ్, ద టెర్మినల్, ఇండియానా జోన్స్.. ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు ప్రాణం పోశారు స్టీవెన్ స్పీల్ బర్గ్. అలా 79 ఏళ్ల వయసులో ఆయన తెరకెక్కించిన చిత్రం ‘డిస్‌క్లోజర్ డే’. హాలీవుడ్ టాప్ నటి ఎమిలీ బ్లంట్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించింది. అలాగే జోష్ ఓ కానర్, కోలిన్ ఫర్త్, ఈవ్ హ్యూసన్, కోల్మన్ డొమింగో తదితర స్టార్స్ ఈ సినిమాలో భాగమయ్యారు. గత నెల 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఏలియన్స్ కాన్పెప్ట్‌తో తీసిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. ఇండియాలోనూ ఈ సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చాయి. థియేటర్లలో ఆడియెన్స్ కు మంచి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ అందించిన డిస్ క్లోజర్ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.


ఇవి కూడా చదవండి



ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో దగ్గర ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం నుంచి ఈ సినిమా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. ప్రస్తుతం ఈ సినిమా కేవలం విదేశాల్లో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. అది కూడా రెంటల్ బేసిస్ లో మాత్రమే. అయితే ఈ శుక్రవారం (జులై 24) ఇండియన్ ఆడియెన్స్ కు కూడా ఈ సినిమా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కాగా డిస్ క్లోజర్ డే చిత్రానికి ఐఎమ్ డీబీలో 10 పాయింట్లకు గానూ 6.7 రేటింగ్ ఉంది దాదాపు 2 గంటల 27 నిమిషాల నిడివి (147 నిమిషాలు) తో సాగే ఈ చిత్రం ఆడియెన్స్ కు మంచి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ ను అందిస్తుందని చెప్పవచ్చు.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిస్ క్లోజర్ డే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *