Headlines

Actress Raasi: ఆ టాలీవుడ్ స్టార్ హీరో అంటే పిచ్చి.. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నా.. కానీ.. రాశి మనసులో మాట | Tollywood Actress Raasi Interesting Comments About Hero Venkatesh And Rajiv Gandhi

Actress Raasi: ఆ టాలీవుడ్ స్టార్ హీరో అంటే పిచ్చి.. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నా.. కానీ.. రాశి మనసులో మాట | Tollywood Actress Raasi Interesting Comments About Hero Venkatesh And Rajiv Gandhi


చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించారు రాశి. ఆ తర్వాత హీరోయిన్ గానూ ఎంట్రీ సక్సెస్ అయ్యారు. తన అందం, అభినయంతో తెలుగుతో పాటు దక్షిణాదిలోనూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. శుభాకాంక్షలు, గోకులంలో సీత, పెళ్లి పందిరి, పండగ, సుప్రభాతం, స్నేహితులు, మనసిచ్చి చూడు, డాడీ డాడీ, స్వప్న లోకం, హరిశ్చంద్ర, కృష్ణబాబు, ప్రేయసి రావే, స్నేహ, పోస్ట్‌మాన్, అమ్మో ఒకటో తారీఖు, దేవుళ్లు, దీవించండి, శ్రీరామచంద్రులు, నిజం, వెంకీ.. ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించారు రాశి. కేవలం కథానాయిక గానే కాకుండా విలన్ గానూ నటించి మెప్పించారీ అందాల తార. తెలుగు తో పాటు తమిళ్, హిందీ భాషల్లో నూ సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. అయితే ‘కల్యాణ వైభోగమే’ సినిమాతో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఇప్పుడు స్టార్ హీరోలు, హీరోయిన్లకు అమ్మగా, అత్తమ్మగా, అక్క పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. కేవలం సినిమాలే కాకుండా టీవీ సీరియల్స్ , ప్రోగ్రామ్స్ లోనూ సందడి చేస్తున్నారు రాశి.

కాగా కొన్ని రోజుల క్రితం ఓ కమెడియన్ అలీ హోస్ట్‌గా ప్రముఖ ఛానెల్ లో ప్రసారమైన అలీతో సరదాగా అనే టాక్ షోకు గెస్ట్‌గా హాజరయ్యారు రాశి. ఈ సందర్భంగా తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచున్నారామె. ఇందులో భాగంగానే టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, అలాగే దివంగత ప్రధాని రాజీవ్ గాంధీల గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు రాశి. ‘నాకు ఆరేళ్ల వయసునన్నప్పుడు చెన్నైలో సినిమా ప్రివ్యూ షోలు వేసేవారు. మా తాత గారికి సినిమా వాళ్లతో టచ్‌లో ఉండటం వల్ల మాకు పాస్‌లు ఇచ్చి ప్రివ్యూ షోలకు తీసుకెళ్లేవారు. మాతాత ఎక్కువగా రామానాయుడు సినిమాలకు అందులోనూ వెంకటేష్ సినిమాలకు వర్క్ చేసేవారు. అలా నేను కూడా వెంకటేష్ సినిమాలు ఎక్కువగా చూడడం వల్ల ఆయనంటే ఒక రకమైన పిచ్చి ఏర్పడింది. చిన్నప్పుడు ఎవరిని పెళ్లి చేసుకుంటావని అడుగుతుంటారు కదా? అలా నేను వెంకటేష్ గారిని తప్పించి ఎవ్వరినీ పెళ్లి చేసుకోను అని చెప్పేదానిని’

‘విక్టరీ వెంకటేష్ గారితో ఒక సినిమాలో సాంగ్‌లో చేశాను. అయితే మీరంటే ఇష్టమని కూడా ఆయనకు ఇప్పటి వరకు చెప్పలేదు. ఇక వెంకటేష్ తర్వాత రాజీవ్ గాంధీ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన చాలా హ్యాండ్సమ్ గా, స్మార్ట్‌గా కనిపించేవారు. అప్పట్లో టీవీలలో, పేపర్‌లలో ఆయనను చూసి మురిసిపోయేదాన్ని. అలాగే ఆయన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పేదానిని’ అని రాశి చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ పాతవే అయినా ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి



Actress Raasi, Venkatesh

Actress Raasi, Venkatesh

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *