Headlines

AE నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో ట్విస్ట్.. రిమాండ్‌ రిపోర్ట్‌లో కీలక విషయాలు.. | AE Nookaraju Family Suicide Case: Remand Report Reveals Shocking Details About Sadik


AE నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో రిమాండ్‌ వెలుగులోకి వచ్చింది. సాదిక్ రిమాండ్‌ రిపోర్టులో కీలక విషయాలు బయటపడ్డాయి. విషపూరిత ఇంజెక్షన్లతో జగదీష్ రెడ్డిని సాదిక్‌ హత్య చేసినట్లు తేలింది. అలాగే షూటింగ్ కోచింగ్ పేరుతో రియాన్ష్‌ కుటుంబంలో చొరబడ్డ సాదిక్‌.. సౌజన్యను పెళ్లి చేసుకోవాలని, భర్త జగదీష్ రెడ్డిని అడ్డు తొలగించేందుకు కుట్ర పన్నినట్లు తేలింది. 2026 ఫిబ్రవరి 14న ఇంట్లో జగదీష్‌పై కత్తితో సాదిక్‌ దాడి చేయగా.. రియాన్ష్‌ ముందే జగదీష్‌రెడ్డిపై కత్తితో సాదిక్‌‌ దాడి చేసినట్లు బయటపడింది. జగదీష్‌ మృతి తర్వాత సౌజన్య, రియాన్షలను నిర్బంధించి బెదిరింపులకు గురి చేశాడని, మతం మారాలని, ఉర్దూ నేర్చుకోవాలని సాదిక్‌‌ ఒత్తిడి తెచ్చినట్లు తేలింది.

డబ్బు, బంగారం, ఆస్తి పత్రాలు లాక్కోవడానికి సాదిక్‌ ప్రయత్నాలు చేశాడని, ఇస్లాం మత ఆచారాలు పాటించాలని సౌజన్యపై సాదిక్‌ ఒత్తిడి తెచ్చినట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పొందుపర్చారు. ఈ రిమాండ్ రిపోర్ట్ ఇప్పుడు కీలకంగా మారింది. అయితే సాదీక్‌ను కస్టడీకి అప్పగించాలని కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీలోకి తీసుకుని మరింత విచారించనున్నారు. ఆ తర్వాత మరిన్ని వివరాలు బయటపడే అవకాశముంది. పోలీసులు వివిధ కోణాల్లో ఈ కేసును విచారిస్తున్నారు. దీంతో రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు బయటపడ్డాయి. కేసు నడిచే కొద్ది మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముంటుంది.

ఈ నెల 16న పిఠాపురం ఏఈ నూకరాజు, ఆయన భార్య మీన, కుమార్తె సౌజన్య, మనవడు కార్తికేయరెడ్డిలు రాజమహేంద్రవరం దగ్గర గోదావరిలోకి దూకారు. వీరిలో కార్తికేయ రెడ్డి ప్రాణాలతో బయటపడగా.. మిగతా ముగ్గురు మరణించారు. సాదిక్ కారణంగానే కుటుంబసభ్యులు ముగ్గురు ఆత్మహత్య చేసుకోగా.. వీరి సూసైడ్ తర్వాత సాదిక్ కనిపించకుండా పోయారు. దీంతో పోలీసులు గాలించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సాదిక్‌‌ను ప్రశ్నించిన అనంతరం అతడ్ని మొబైల్‌ జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు. అతడికి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించడంతో కాకినాడ సబ్‌ జైలుకు తరలించారు. ఇక ఈ కేసులో విచారణ కోసం సాదిక్‌ను తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *