Headlines

Andhra Pradesh: 23 రోజుల తర్వాత లభించిన మత్స్యకారుల ఆచూకీ.. ఆ ఏడుగురు ఎక్కడ ఉన్నారంటే..? | Big Relief for AP Fishermen Families: 7 Fishermen Missing at Sea Found Safe After 23 Days


ఏపీలోని అల్లవరం మండలం వాడలరేవు నుండి వేటకు వెళ్లి సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులు ఆచూకీ లభించింది. సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారుల ఎక్స్క్లూజివ్ వీడియో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈనెల మూడవ తేదీన వేటకు వెళ్లిన మత్స్యకారులు బోటు సాంకేతిక లోపంతో నిలిచిపోవడంతో సముద్రం మధ్యలోనే చిక్కుకుపోయారు. ఇందులో ఏడుగురు మత్స్యకారులు ఉన్నారు. ప్రస్తుతం పశ్చిమబెంగాల్ సముద్ర తీరంలో ఈ ఏడుగురు మత్స్యకారులు ఉన్నారు. 23 రోజుల తర్వాత వీరి ఆచూకీ లభ్యం కావడంతో కుటుంబసభ్యులు ఊపరిపీల్చుకున్నారు.

సముద్రం మధ్యలోనే ఆగిపోయిన బొట్టులో బిక్కుబిక్కుమంటూ ఏడుగురు మత్స్యకారులు ఉన్నారు. రెండు రోజుల్లో స్వగ్రామానికి ఏడుగురు మత్స్యకారులు రానున్నారు. మత్స్యకారుల వీడియో బయటకు రావడంతో.. ఓడలరేవులో బాధిత కుటుంబాల వద్దకు వెళ్లి తమ బంధువులు సేఫ్‌గా ఉన్నారంటూ అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు.. స్వీట్లు తినిపించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు చొరవతో గాలింపు చర్యలు ముమ్మరం చేసి ఆచూకీ కనుగొన్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా మత్స్యకారులను స్వగ్రామానికి తీసుకొస్తామన్న ఎమ్మెల్యే ఆనందరావు హామీ ఇచ్చారు. మొత్తానికి 23 రోజలు తర్వాత ఆచూకీ లభించడంతో మత్స్యకారుల కుటుంబసభ్యుల ఊపీరిపీల్చుకున్నారు. ఆచూకీ లభించడంతో సంతోషపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *