Headlines

August Festivals: శ్రావణ మాసం ఆరంభం.. వరలక్ష్మీ వ్రతం నుంచి రాఖీ పౌర్ణమి వరకు ఆగస్టులో ముఖ్య పండుగలు ఇవే | August 2026 Telugu Calendar: Complete List of Festivals, Vratas and Auspicious Days

August Festivals: శ్రావణ మాసం ఆరంభం.. వరలక్ష్మీ వ్రతం నుంచి రాఖీ పౌర్ణమి వరకు ఆగస్టులో ముఖ్య పండుగలు ఇవే | August 2026 Telugu Calendar: Complete List of Festivals, Vratas and Auspicious Days


Auspicious Days, Vratams, and Celebrations in August: 2026 ఆగస్టు నెల తెలుగు పంచాంగం ప్రకారం ఎన్నో పవిత్రమైన పండుగలు, వ్రతాలు, ఆధ్యాత్మిక విశేషాలతో నిండి ఉంది. ఈ నెలలో భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించే అనేక వ్రతాలు, దేవతా జయంతులు, ఆలయ ఉత్సవాలు జరగనున్నాయి. ముఖ్యంగా ఆగస్టు 13 నుంచి ప్రారంభమయ్యే శ్రావణ మాసం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసంగా పరిగణించబడుతుంది. తెలుగు పంచాంగం ప్రకారం ఆగస్టు 12తో ఆషాఢ మాసం ముగియగా, ఆగస్టు 13 (గురువారం) నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఈ నెలలో శివుడు, మహావిష్ణువు, మహాలక్ష్మీ దేవిని ఆరాధించడం విశేష ఫలితాలను ఇస్తుందని విశ్వాసం.

ఆగస్టు 2026లో ముఖ్యమైన పండుగలు, వ్రతాలు

  • ఆగస్టు 2 – సంకటహర చతుర్థి
  • ఆగస్టు 9 – కామికా ఏకాదశి
  • ఆగస్టు 10 – ప్రదోష వ్రతం
  • ఆగస్టు 11– మాస శివరాత్రి
  • ఆగస్టు 15 – భారత స్వాతంత్ర్య దినోత్సవం
  • ఆగస్టు 17 – గరుడ పంచమి, నాగ పంచమి, కల్కి జయంతి
  • ఆగస్టు 21 – వరలక్ష్మీ వ్రతం (సకల ఐశ్వర్యాలు, సౌభాగ్యాన్ని ప్రసాదించే పవిత్ర వ్రతంగా భావిస్తారు.)
  • ఆగస్టు 22 – తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు ప్రారంభం
  • ఆగస్టు 26 – తిరుమల శ్రీవారి తెప్పోత్సవాల ముగింపు, ఓనం పండుగ
  • ఆగస్టు 28 – జంధ్యాల పౌర్ణమి, హయగ్రీవ జయంతి, రాఖీ పౌర్ణమి
  • ఆగస్టు 30 – శ్రావణ పౌర్ణమి, పుబ్బ కార్తె
  • ఆగస్టు 31– సంకటహర చతుర్థి

ఆధ్యాత్మికంగా విశేషమైన నెల

శ్రావణ మాసంలో ఉపవాసాలు, శివారాధన, లక్ష్మీ పూజలు, నాగదేవత ఆరాధన, విష్ణు పూజలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. ఈ నెలలో వచ్చే ప్రతి వ్రతం, పండుగకు ప్రత్యేక ఆధ్యాత్మిక విశిష్టత ఉంది. అలాగే తిరుమలలో జరిగే పవిత్రోత్సవాలు, తెప్పోత్సవాలు వేలాది మంది భక్తులను ఆకర్షిస్తాయి. ఆధ్యాత్మిక సంప్రదాయాలను పాటిస్తూ, ఈ పవిత్రమైన పండుగలు, వ్రతాలను భక్తిశ్రద్ధలతో ఆచరించడం ద్వారా దైవానుగ్రహం, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, కుటుంబ సౌఖ్యం కలుగుతాయని భక్తుల విశ్వాసం.

ఇవి కూడా చదవండి



(Disclaimer: ఈ కథనంలోని పండుగలు, వ్రతాలు, తిథులు, మాసాల ప్రారంభం–ముగింపు తేదీలు తెలుగు పంచాంగం ఆధారంగా అందించబడ్డాయి. ప్రాంతం, పంచాంగ సంప్రదాయం (దృక్, వాక్య, స్థానిక పంచాంగాలు మొదలైనవి), సూర్యోదయ సమయాల్లోని తేడాల కారణంగా తేదీలు, పూజా ముహూర్తాలు లేదా తిథుల వ్యవధిలో స్వల్ప మార్పులు ఉండవచ్చు. ఏదైనా వ్రతం లేదా పూజను ఆచరించే ముందు మీ ప్రాంతానికి సంబంధించిన అధికారిక పంచాంగం లేదా అర్చకులను సంప్రదించడం మంచిది.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *