Headlines

Lenin OTT: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి ‘లెనిన్’! అఖిల్ అక్కినేని 100 కోట్ల సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే? | Akhil Akkineni Bhagyashri Borse Starrer Lenin Movie To Stream On ZEE5 OTT From August 07th

Lenin OTT: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి ‘లెనిన్’! అఖిల్ అక్కినేని 100 కోట్ల సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే? | Akhil Akkineni Bhagyashri Borse Starrer Lenin Movie To Stream On ZEE5 OTT From August 07th


అఖిల్ అక్కినేని హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘లెనిన్’. మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ఈ విలేజ్ లవ్ స్టోరీలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించింది. భారీ అంచనాలతో జులై 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన లెనిన్ అక్కినేని కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఏకంగా రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఈ విషయాన్ని రెండు రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు నిర్మాతలు. ఇప్పటికీ చాలా చోట్ల థియేటర్లలో ఆడుతోన్న లెనిన్ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ మేరకు శనివారం (ఆగస్టు 1) అయ్యగారి సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పై అధికారిక ప్రకటన వచ్చేసింది. లెనిన్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 సొంతం చేసుకుంది. ఆగస్టు 07 నుంచి అఖిల్ సినిమా ఓటీటీలోకి రానుంది. ఈ విషయాన్ని జీ5 ఓటీటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఇదే క్రమంలో అఖిల్ సినిమాకు సంబంధించి ఒక వీడియోను కూడా షేర్ చేసింది.

లెనిన్ సినిమా విషయానికి వస్తే.. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. హీరో, హీరోయిన్లతో పాటు ఈశ్వరీ రావు, ప్రమోద్ పంజు, బ్రహ్మాజీ, రాంకీ, సునీల్, గెటప్ శ్రీను, శత్రు తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందించారు.

జీ 5 ఓటీటీలో అఖిల్ అక్కినేని లెనిన్..

మరో 6 రోజుల్లో ఓటీటీలోకి అయ్యగారి ఆగమనం..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *