ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం.. | Weather Alert: Andhra Pradesh and Telangana Issued Red, Yellow Alerts as Low Pressure Forms – Viral Videos in Telugu
వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం బుధవారానికి అల్పపీడనంగా మారనుండటంతో తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన జారీ అయింది. రాగల రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయి.వాతావరణ శాఖ ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా, తెలంగాణలోని నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, నిర్మల్ సహా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ అయ్యాయి. గంటకు…