దారుణం.. భోజనం ఆలస్యమైందని… వదిన తల నరికి చెట్టుకు వేలాడదీసిన మరిది..! | Bihar: Young Man Beheads Sister In Law Over Delay In Serving Food in Jehanabad District
బీహార్‌లో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. జెహానాబాద్ జిల్లా పార్స్ బిఘా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇమాద్‌పూర్ గ్రామంలో ఓ వ్యక్తి తన వదినను గొడ్డలితో హత్య చేసి, అనంతరం ఆమె తలను నరికి ఇంటి ముందున్న చెట్టుకు వేలాడదీశాడు. ఈ అమానుష ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. మృతురాలిని ధర్మేంద్ర కుమార్ భార్య, 25 ఏళ్ల అన్షు దేవిగా పోలీసులు గుర్తించారు. గ్రామస్థుల కథనం ప్రకారం, నిందితుడు కునాల్ కుమార్ మాదకద్రవ్యాలకు బానిస….