Telangana: భయాన్ని గెలిచి.. ప్రాణదాతగా మారి.. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న రైతు..
కామారెడ్డి జిల్లా ఆగస్ట్ 31: దేన్నైనా ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే వెతుక్కోవాలి, ఎక్కడ ఓడిపోయామో అక్కడే గెలిచి చూపించాలి అంటుంటారు. అచ్చం అలాంటి నిర్ణయమే తీసుకున్నాడు కామారెడ్డి జిల్లా జంగంపల్లికి చెందిన రైతు మోహన్ రెడ్డి. పాము కాటుతో తండ్రిని కోల్పోయిన విషాదాన్ని తన బలంగా మార్చుకుని, ప్రస్తుతం స్నేక్ క్యాచర్‌గా మారి వేలాది మంది ప్రాణాలను కాపాడుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. చిన్నప్పటి నుంచి పాములంటే ఆమడ దూరం పరిగెత్తే మోహన్ రెడ్డి జీవితాన్ని ఒక విషాద…