Headlines

Cinema: 23 మంది పిల్లల మిస్సింగ్.. ఓటీటీలో దుమ్మురేపిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. ఇప్పుడు యూట్యూబ్‌లో ఫ్రీగా.. | Must Watch Psycological Crime Thriller A (Ad Infinitum) Movie Is Streaming On Amazon Prime Video OTT And YouTube


కొన్ని సినిమాలు థియేటర్లలో రిలీజైనప్పుడు పెద్దగా ఆడవు. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. పేరున్న నటీనటులు లేకపోవడం, ప్రమోషన్లు సరిగ్గా చేయకపోవడం, అలాగే థియేటర్ల సమస్య.. ఇలా చాలా కారణాలతో కొన్ని సినిమాలు అలా వచ్చి ఇలా వెళ్లిపోతుంటాయి. అలా బిగ్ స్క్రీన్ పై సందడి చేయని సినిమాలు ఒక్కోసారి ఓటీటీ లేదా యూట్యూబ్‌లో వచ్చినప్పుడు మంచి రెస్పాన్స్ ఉంటుంది. భారీగా వ్యూయర్ షిప్ ఉంటుంది. మరీ ముఖ్యంగా సస్పెన్స్, క్రైమ్, హారర్, థ్రిల్లర్ సినిమాల విషయంలో తరచూ ఇలా జరుగుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. గతేడాది శంబాల వంటి సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ యుగంధర్ ముని ఈ సినిమాను తెరకెక్కించాడు. అయితే థియేటర్లలో రిలీజైనప్పుడు ఈ మూవీ పెద్దగా ఆడలేదు. కానీ ఆ తర్వాత ఓటీటీలో మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. భారీగా వ్యూయర్ షిప్ వచ్చింది. ఇప్పుడీ సినిమా యూట్యూబ్ లో ఫ్రీగా అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. హీర సంజీవ్ ఓ హాస్పిటల్లో అకౌంటెంట్ గా వర్క్ చేస్తుంటాడు. అదే హాస్పిటల్లో నర్స్ గా వర్క్ చేసే పల్లవిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వీరిద్దరూ సంతోషకరమైన జీవితాన్ని గడుపుతుంటారు. అయితే అదే సమయంలో సిటీలో పిల్లలు వరుసగా అదృశ్యమవుతారు. అలా సుమారు 23 మంది పిల్లలు మిస్సింగ్ అవుతారు. అయితే అనుకోకుండా ఈ కేసులో సంజీవ్ ఇరుక్కుంటాడు. మరి ఆ పిల్లల వెనక సందీప్ ఉన్నది నిజమేనా? అసలు ఆ పిల్లల కిడ్నాప్ కు సంజీవ్ కు ఉన్న సంబంధమేంటి? చివరకు ఈ కేసు ఎలా పరిష్కారమయ్యింన్నదే ఈ సినిమా కథ.

నరుడి బ్రతకు నటన సినిమాతో ప్రశంసలతో పాటు అవార్డులు అందుకున్న నితిన్ ప్రసన్న హీరోగా నటించిన చిత్రం A (ఏడీ ఇన్ఫినిటమ్). మళ్లీ రావా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రీతీ అశ్రాని ఇందులో హీరోయిన్ గా నటించింది. స్నేహల్‌ కమత్, బేబీ దీవెన, రంగాథం, కృష్ణవేణి, భరద్వాజ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. శంబాల కంటే ముందు డైరెక్టర్ యుగంధర్ ముని ఈ సినిమాను తెరకెక్కించాడు. అది కూడా ‘క్రౌడ్ ఫండింగ్’ పద్ధతిలో. థియేటర్లలో పెద్దగా ఆడని ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో అందుబాటులో ఉంది. ఇప్పుడు యూట్యూబ్ లో కూడా ఫ్రీగా అందుబాటులోకి వచ్చింది. వీకెండ్ లో మంచి సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా చూడాలనుకునేవారికి A (ఏడీ ఇన్ఫినిటమ్) ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి



A (ఏడీ ఇన్ఫినిటమ్) సినిమా ట్రైలర్..


మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *