Headlines

DC Movie OTT: డైరెక్టరే హీరో.. ఓటీటీలోకి వచ్చేసిన ‘డీసీ’.. లోకేశ్ కనగరాజ్ 100 కోట్ల సినిమాను ఎక్కడ చూడొచ్చంటే? | Lokesh Kanagaraj Starrer DC Movie Is Streaming Now On Sun NXT OTT, Telugu Version Also Available


ఖైదీ, మాస్టర్, లియో, కూలీ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించిన స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమా డీసీ. కెప్టెన్ మిల్లర్ తో జాతీయ అవార్డు అందుకున్న అరుణ్ మాథేశ్వరన్ రా అండ్ రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ ను తెరకెక్కించాయి. వామికా గబ్బి హీరోయిన్ గా నటించింది. ఆగస్టు 07న తెలుగు, తమిళం భాషల్లో రిలీజైన డీసీ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పాజిటివ్ రివ్యూలకు తోడు మౌత్ టాక్ అద్భుతంగా ఉండడంతో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను సాధించింది. లోకేశ్, వామికాల యాక్టింగ్, అరుణ్ మాథేశ్వరన్ టేకింగ్ అన్నిటికీ మించి అనిరుధ్ బీజీఎమ్ డీసీ సినిమాను బ్లాక్ బస్టర్ గా నిలిపాయి. పోటీగా వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు సినిమా ఉన్నప్పటికీ డీసీ సినిమాకు డీసెంట్ కలెక్షన్లు రావడం విశేషం. ఓవరాల్ గా ఈ సినిమాకు రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. కేవలం సామాన్య ప్రేక్షకులే కాదు అల్లు అర్జున్, మహేష్ బాబు తదితర స్టార్ హీరోలు సైతం డీసీ సినిమాను చూసి ప్రశంసలు కురిపించడం విశేషం. థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన డీసీ సినిమాను ఓటీటీలోనూ చూడాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వారి నిరీక్షణకు తెరపడింది. డీసీ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సన్ నెక్ట్స్ సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 04 నుంచి ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకురానున్నట్లు ఇదివరకే అధికారికంగా ప్రకటించింది ఓటీటీ సంస్థ. అందుకు తగ్గట్టుగానే శుక్రవారం అర్ధరాత్రి నుంచే డీసీ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులోకి వచ్చేసింది.

డీసీ సినిమా విషయానికి వస్తే.. ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మించింది. వామికా గబ్బి, సంజనా కృష్ణమూర్తి హీరోయిన్లు గా నటించారు. అలాగే తలైవాసల్ విజయ్, అవినాష్ రఘు దేవన్, కస్తూరి రాజా, బాలాజీ దేవీ ప్రసాద్, శ్రీకృష్ణ దయాల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రాక్ స్టార్ అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందించారు. మరి థియేటర్లలో డీసీ సినిమాను మిస్ అయ్యారా? లేదా మళ్లీ చూడాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు లేటు ఇంట్లోనే ఎంచెక్కా చూసేయండి.

ఇవి కూడా చదవండి



సన్ నెక్ట్స్ లో డీసీ సినిమా..

డీసీ సినిమా ట్రైలర్..



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *