Headlines

Guru Blessings: గురువు కటాక్షం.. అక్టోబర్ కల్లా వారు ఐశ్వర్యవంతులు కాబోతున్నారు..! | Jupiter in Cancer: Wealth, Career Growth and Divine Grace for These Zodiac Signs

Guru Blessings: గురువు కటాక్షం.. అక్టోబర్ కల్లా వారు ఐశ్వర్యవంతులు కాబోతున్నారు..! | Jupiter in Cancer: Wealth, Career Growth and Divine Grace for These Zodiac Signs


జ్యోతిషశాస్త్రం ప్రకారం గురు గ్రహం ఐశ్వర్యం, ఆదాయం, సంతానం, దైవానుగ్రహం, అదృష్టం, ఇల్లు, శుభ కార్యాలు వంటి వాటికి కారకుడు. ప్రస్తుతం కర్కాటక రాశిలో సంచారం చేస్తున్న గురువు 2026 అక్టోబర్ 31 వరకు తనకు ఇష్టమైన కొన్ని రాశులకు ఈ అంశాలన్నిటిని అనుగ్రహించే అవకాశం ఉంది. గురువు తనకు మిత్ర గ్రహాలైన కుజ, రవి, చంద్ర గ్రహాలు అధిపతులుగా ఉన్న మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీన రాశుల వారికి దుస్థానాలతో సంబంధం లేకుండా అనేక విధాలుగా మేలు చేసే అవకాశం ఉంది. దేవతలకు గురువైన ఈ గురువు అనుగ్రహించడమంటే దేవతలంతా అనుగ్రహించినట్టే భావించవచ్చు.

మేషం

ఈ రాశికి చతుర్థ స్థానంలో సంచారం ప్రారంభించిన గురువు ఈ రాశివారు ఏ చిన్న ప్రయత్నం చేపట్టినా పూర్తి స్థాయిలో అది నెరవేరేలా చేయడం జరుగుతుంది. వీరికి శ్రమ తక్కువ లాభం ఎక్కువగా ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. అక్టోబర్ లోగా ఐశ్వర్యవంతులు కావడం తప్పకుండా జరుగుతుంది. ఉద్యోగంలో శీఘ్ర పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఏ రంగంలో ఉన్నా వీరు ఉన్నత స్థితికి చేరుకుంటారు.

కర్కాటకం

రాశ్యధిపతి చంద్రుడికి మిత్రుడైన గురువు ప్రస్తుతం ఇదే రాశిలో ఉచ్ఛ స్థితిలో సంచారం చేస్తున్నం దువల్ల ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు ఎక్కువగా అందుతాయి. రాజపూజ్యాలు కలుగుతాయి. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. అదనపు ఆదాయాన్ని షేర్లు, స్పెక్యు లేషన్లు, ఇతర ఆర్థిక లావాదేవీల మీద పెట్టుబడులు పెట్టి లబ్ధి పొందుతారు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. శుభకార్యాలు జరుగుతాయి.

ఇవి కూడా చదవండి



సింహం

రాశ్యధిపతి రవికి పరమ మిత్రుడైన గురువు ఈ రాశికి వ్యయ స్థానంలో సంచారం చేస్తున్నప్పటికీ అనేక విధాలుగా అదృష్టాలు కలుగుతాయి. ఈ రాశివారి స్థితిగతులు మారిపోతాయి. సాధారణ వ్యక్తి సైతం సంపన్నుడయ్యే అవకాశం ఉంది. ప్రముఖుల సాన్నిహిత్యంతో ఎంతో పురోగతి చెందు తారు. అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. సొంత ఇల్లు, వాహన కలుగుతాయి. మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు బిజీగా సాగుతాయి.

వృశ్చికం

రాశినాథుడైన కుజుడు గురువుకు మిత్రుడు కావడం, పైగా ఈ రాశికి భాగ్య స్థానంలో సంచారం చేయడం వల్ల ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. రావలసిన డబ్బు, రాదనుకున్న డబ్బు, బాకీలు, బకాయిలన్నీ వసూలవుతాయి. ఆస్తి లాభం కలుగుతుంది. బాగా సంపన్ను డయ్యే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి లాభిస్తాయి. ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది.

ధనుస్సు

ఈ రాశికి గురువు అధిపతి అయినందువల్ల గురువు అష్టమ స్థానంలో ఉచ్ఛపట్టినా ఈ రాశికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఎక్కువగా గురువు అనుగ్రహం పొందే అవకాశం ఉంది. ఆదా యం దిన దినాభివృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి. ప్రముఖులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి. సంపన్న వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి కావడం జరుగుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఉద్యోగ, వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది.

మీనం

ఈ రాశికి అధిపతి అయిన గురువు అక్టోబర్ 31 లోగా ఈ రాశివారిని అనేక విధాలుగా ఉన్నత స్థాయికి తీసుకు వెళ్లే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు, జీతభత్యాలు, లాభాలు, ఆస్తుల ద్వారా ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశం ఉంది. కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. సొంత ఇంటి యోగం పడుతుంది. సామాజికంగా స్థాయి, హోదా వృద్ధి చెందుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *