Headlines

Haiku Movie: ‘కోర్టు’ హీరోయిన్ కొత్త సినిమా టీజర్ చూశారా? శ్రీదేవి మరో హిట్ కొట్టేలా ఉందిగా.. | Sridevi, Aegan Starrer Haiku Movie Teaser Out Now, Movie To Release On October 23rd


విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై ఏగన్ హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘హైకూ’. ఈ మూవీ టీజర్‌ను ప్రముఖ రొమాంటిక్ హీరో హరీష్ కళ్యాణ్ రిలీజ్ చేశారు. కలర్‌ఫుల్ విజువల్స్, యూత్‌ఫుల్ ట్రీట్‌మెంట్, పొయెటిక్ లవ్‌స్టోరీగా రూపొందిన ఈ టీజర్ చూడగానే ఆకట్టుకుంటోంది. ఆకర్షణీయమైన విజువల్స్‌తో పాటు ఫ్రెష్ టేకింగ్‌తో ఈ ప్రేమకథను దర్శకుడు కొత్తగా ప్రజెంట్ చేశారు. వావ్ అనిపించే ఫ్రేమ్స్, ఆహ్లాదకరమైన సన్నివేశాలు, లవ్ ఎమోషన్స్‌తో నిండిన ఈ టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. నేటి ట్రెండ్‌కు తగ్గ కథ, కథనం, బ్యూటీఫుల్ ప్రెజెంటేషన్‌తో పాటు మనసును హత్తుకునే వాతావరణాన్ని క్రియేట్ చేసేలా ‘హైకూ’ టీజర్‌ను రూపొందించారు. దీంతో ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి మరింత పెరుగుతోంది.ఈ అందమైన రంగుల ప్రేమ ప్రపంచానికి ఏగన్, శ్రీదేవిలే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ, హావభావాలు టీజర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. గతంలో ‘కోళి పన్నై’, ‘చెల్లదురై’ చిత్రాల్లో తన సహజమైన, పల్లెటూరి నేపథ్యానికి తగ్గ నటనతో ప్రశంసలు అందుకున్న ఏగన్.. ‘హైకూ’లో మాత్రం సరికొత్త అవతార్‌లో కనిపిస్తున్నాడు. సిటీ కల్చర్‌కు తగ్గ కూల్, అమాయకమైన పక్కింటి అబ్బాయి తరహా పాత్రలో ఏగన్ ఫ్రెష్ లుక్‌తో ఆకట్టుకుంటున్నాడు. శ్రీదేవి కూడా తనదైన సహజమైన నటనతో ఏగన్ సరసన చక్కటి జోడీగా కుదిరింది. వీరిద్దరి కెమిస్ట్రీ టీజర్‌లోని అందమైన, ఆహ్లాదకరమైన క్షణాలను మరింత బలంగా మార్చింది. టీజర్ ఎండింగ్‌లో ఫెమినా జార్జ్ ఎంట్రీ సర్‌ప్రైజింగ్‌గా ఉంది. ఆమె కనిపించేది కొద్దిసేపే అయినా.. తన ప్రత్యేకమైన స్క్రీన్ ప్రజెన్స్‌తో వెంటనే అందరి దృష్టిని ఆకర్షించింది.

‘హైకూ’లోని రొమాంటిక్ ఫీల్‌కు సిద్ధు కుమార్ సంగీతం మెయిన్ ఎసెట్‌గా మారింది. ముఖ్యంగా మృదువైన వయొలిన్ బిట్స్‌ను క్లాసికల్ రాగాలు, కాంటెంపరరీ ఫ్యూజన్‌తో మేళవించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. ఆహ్లాదకరమైన విజువల్స్‌కు చక్కగా తోడై టీజర్‌కు మరింత మ్యూజికల్ ఫీల్‌ను తీసుకొచ్చింది. ప్రేక్షకులను ఓ అందమైన, రంగులతో నిండిన ప్రేమ ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ‘హైకూ’ టీజర్‌ను చక్కగా తీర్చిదిద్దారు. ప్రేమలోని పరిచయమైన భావోద్వేగాలను రచయిత, దర్శకుడు యువరాజ్ చిన్నసామి తన ఫ్రెష్ ప్రజెంటేషన్‌తో కొత్తగా చూపించారు. దీంతో ‘హైకూ’ టీజర్ ఫ్రెష్‌గా, క్యూట్‌గా అనిపిస్తోంది.

‘హైకూ’ టీజర్ ఇప్పటికే సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. తమిళ ప్రేక్షకుల్లో రొమాంటిక్ కథలకు మరోసారి మంచి ఆదరణ లభిస్తోన్న సమయంలో ఈ టీజర్ రావడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. యూత్‌ఫుల్ కాస్టింగ్, ఆకట్టుకునే విజువల్స్, హృద్యమైన సంగీతం, ఫ్రెష్ ట్రీట్‌మెంట్‌తో ‘హైకూ’ ఈ సీజన్‌లో రాబోతున్న ఆసక్తికరమైన రొమాంటిక్ చిత్రాల్లో ఒకటిగా నిలుస్తోందనిపిస్తోంది. ‘హైకూ’ సినిమాకు మరో ప్రధానమైన అంశం ఏమిటంటే.. షూటింగ్ పూర్తికాకముందే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. సినిమాకు ఉన్న ఫ్రెష్ స్టోరీ, ప్రత్యేకమైన ప్రజెంటేషన్ నెట్‌ఫ్లిక్స్‌ను ఆకట్టుకోవడంతో.. ఫ్యాన్సీ రేటుకు డిజిటల్ రైట్స్‌ను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఓటీటీ భాగస్వామ్యాల కోసం పోటీ మరింత పెరిగిన సమయంలో.. ‘హైకూ’కు ఇంత ముందుగానే డిజిటల్ డీల్ క్లోజ్ కావడం సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.

ఇవి కూడా చదవండి



యువరాజ్ చిన్నసామి రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హైకూ’ చిత్రాన్ని విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై డా. డి. అరుళానందు, మాథ్యూ అరుళానందు నిర్మిస్తున్నారు. ఏగన్, శ్రీదేవి, ఫెమినా జార్జ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. హరి హరన్ రామ్ అదనపు స్క్రీన్‌ప్లే అందించారు. ప్రియేష్ గురుస్వామి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, శక్తి ప్రణేష్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సిద్ధు కుమార్ సంగీతం సమకూరుస్తుండగా, ప్రేమ్ ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నారు. రొమాంటిక్ ప్రపంచాన్ని అందమైన విజువల్స్‌తో పరిచయం చేసిన ‘హైకూ’ టీజర్ ఇప్పటికే ఆకట్టుకుంటుండగా.. ఈ సినిమా 2026 అక్టోబర్ 23న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది.

హైకూ సినిమా రిలీజ్ డేట్ టీజర్



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *