Headlines

Health Insurance: సంచలన నిర్ణయం.. రూ. 25 లక్షల వరకు ప్రతి ఒక్కరికి ఉచితంగా వైద్య సేవలు..! | People Of Tamil Nadu Can Get Free Medical Services Up To 25 Lakh Rupees


Free Health Insurance: సామాన్యులకు మెరుగైన వైద్యం అందించే లక్ష్యంతో తమిళనాడు ప్రభుత్వం ఆరోగ్య రంగంలో కీలక మార్పులు తీసుకువచ్చింది. రాష్ట్రంలో అమలులో ఉన్న ముఖ్యమంత్రి సమగ్ర ఆరోగ్య బీమా పథకం (CMCHIS) ద్వారా అందించే వార్షిక ఉచిత వైద్య బీమా పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

రూ. 5 లక్షల నుండి రూ. 25 లక్షలకు పెంపు:

గతంలో ఈ పథకం కింద ప్రతి కుటుంబానికి ఒక సంవత్సరానికి రూ.5 లక్షల వరకు మాత్రమే ఉచిత వైద్య బీమా వర్తించేది. అయితే, ప్రజల పెరుగుతున్న వైద్య ఖర్చులు, ప్రాణాంతక వ్యాధులకు వైద్యం మరింత వ్యయంతో కూడుకున్నదిగా మారడాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ బీమా పరిమితిని ఏకంగా రూ. 25 లక్షలకు ప్రభుత్వం పెంచింది. దీనివల్ల సామాన్యులకు పెద్ద ఎత్తున ఆర్థిక భద్రత చేకూరనుంది.

ఇది కూడా చదవండి: Hyderabad: తెలంగాణలో భూములకు రికార్డు ధర.. ఎకరం రూ.264 కోట్లు.. ఎవరు కొన్నారో తెలుసా?

ఇవి కూడా చదవండి



ఏయే వైద్య చికిత్సలు లభిస్తాయి?

బీమా మొత్తం భారీగా పెంచడంతో క్యాన్సర్, గుండె సంబంధిత జబ్బులు, కిడ్నీ మార్పిడి, న్యూరో సర్జరీలు వంటి ఖరీదైన, అత్యవసరమైన ఉన్నత స్థాయి వైద్య చికిత్సలను (Advanced Treatments) పేదలు కూడా ఎటువంటి రుసుము చెల్లించకుండా ఉచితంగా పొందవచ్చు.

అర్హతలు ఏమిటి?

ఈ పథకానికి అర్హత పొందడానికి రేషన్ కార్డు ప్రాతిపదికగా తీసుకుంటారు. రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యులందరూ ఈ బీమా కింద లబ్ధి పొందడానికి అర్హులు. ఈ పథకంలో లబ్ధి పొందాలంటే సదరు కుటుంబం వార్షిక ఆదాయం రూ. 1,20,000 కంటే తక్కువగా ఉండాలి.

దరఖాస్తు చేసుకునే విధానం, కావాల్సిన పత్రాలు:

ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవడానికి, కార్డు పొందడానికి కింది నిబంధనలు పాటించాలి. ఆదాయ ధృవీకరణ పత్రం: గ్రామ పంచాయతీ నుంచి ఆదాయ ధృవీకరణ పత్రాన్ని పొందాలి. దీనికి అవసరమైన పత్రాలు: కుటుంబ రేషన్ కార్డ్, ప్రభుత్వ గుర్తింపు పొందిన గుర్తింపు కార్డు. అయితే పైన పేర్కొన్న పత్రాలను తీసుకుని, సంబంధిత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక/ప్రత్యేకమైన కేంద్రాన్ని సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం అమలు ద్వారా తమిళనాడులోని కోట్లాది పేద కుటుంబాలకు పెద్ద జబ్బులొచ్చినప్పుడు ఆసుపత్రి ఖర్చుల భారం తప్పుతుందని, ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు జాబితాలో ఉన్న ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులలో కూడా ఈ ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: Chicken Prices: మాసం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన చికెన్‌ ధర.. ఎంతో తెలిస్తే ఎగబడి కొంటారు..!

ఇది కూడా చదవండి: House Construction: 150 గజాల ఇంటి నిర్మాణానికి 12 పిల్లర్ల ఖర్చు ఎంతో తెలుసా..?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *