Headlines

Jabardasth:అందుకే రోడ్డుపై పడుకుని వీడియో చేశా.. అసలు విషయమేంటో చెప్పిన జబర్దస్త్ నవదీప్.. నెటిజన్ల ఫైర్ | Jabardasth Actor Navadeep Reveals The Real Story Behind His Viral Roadside Video


జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో నవదీప్ ఒకడు. సందర్భానికి తగ్గట్టుగా పాటలు పాడుతూ కామెడీ చేయడం ఇతని స్పెషాలిటీ. జబర్దస్త్ తో పాటు శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలోనూ నవదీప్ కనిపిస్తుంటాడు. అయితే ఈ మధ్యన ఈ కమెడియన్ కు సంబంధించిన ఒక వీడియో నెట్టింట బాగా వైరల్ అయ్యింది. అందులో నవదీప్ రోడ్డుపై పడుకుని ఉండడం చూసి అందరూ షాక్ అయ్యారు. అంతేకాదు ఒక వ్యక్తి నవదీప్ దగ్గరకు వెళ్లి ఏమైందన్నా అని అడిగతే.. ‘ ఒక అమ్మాయిని ప్రాణం గా ప్రేమించాను. కానీ నన్ను మోసం చేసింది. 30 లక్షల డబ్బులు ఉండేవి నా దగ్గర. మొత్తం IPL లో పెట్టి పోగొట్టింది. ఇప్పుడు తినేదానికి కూడా నా దగ్గర ఏమి లేదు’ అని చెప్పుకొచ్చాడీ జబర్దస్త్ కమెడియన్. ఈ వీడియో క్షణాల్లోనే వైరల్ గా మారింది. చాలా మంది ఈ వీడియోను చూసి నవదీప్ పై జాలి పడ్డారు. మరికొందరేమో ఇదేదో సినిమా ప్రమోషన్ కోసమని అభిప్రాయపడ్డారు. అయితే తాజాగా ఈ వీడియో వెనక అసలు విషయాన్ని బయట పెట్టాడు నవదీప్. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా మరో వీడియోను రిలీజ్ చేశాడీ జబర్దస్త్ కమెడియన్.. ‘నా వైరల్‌ వీడియోను చూసి చాలామంది ఫోన్లు, మెసేజ్‌లు చేశారు. నా పరిస్థితి గురించి అడిగారు. నాపై ఇంతగా ప్రేమ, అభిమానం చూపిస్తూ ఆందోళన వ్యక్తం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. అదే సమయంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నా వీడియోను చూసి ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను ఉద్దేశపూర్వకంగా నా నిజ జీవిత పరిస్థితిని చూపిస్తూ ఆ వీడియో చేయలేదు. మేము రూపొందిస్తోన్న ఓ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే ఈ వీడియో చేశాం. అయితే ప్రమోషన్‌ కోసం రూపొందించిన కంటెంట్‌ అనూహ్యంగా సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో చాలామంది దాన్ని నిజమైన ఘటనగా భావించారు. అందుకే నా గురించి ఆందోళన చెందుతున్న అభిమానులకు అసలు విషయం చెప్పాల్సి వచ్చింది’

‘మా ‘కాగితం మనుషులు’ సినిమా ఎప్పుడో పూర్తయ్యింది. అయితే బడ్జెట్ సమస్యల కారణంగా విడుదల ఆలస్యమవుతోంది. ముఖ్యంగా మ్యూజిక్‌కు సంబంధించిన పనులను పూర్తి చేయడానికి అవసరమైన డబ్బులు లేవు. ఈ సినిమాలోన పాటలను నేనే రాశాను. ఒక మంచి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి షూటింగ్‌ పూర్తయితే సరిపోదు. మ్యూజిక్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌, ఇతర నిర్మాణ పనులకు కూడా డబ్బులు భారీగా అవసరం. ప్రస్తుతం ‘కాగితం మనుషులు’సినిమాను పూర్తి స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలంటే మీ అందరి ఆర్థిక సహకారం అవసరం. సినిమాకు బడ్జెట్ విషయంలో ఎవరైనా సహాయం చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి’ అని నవదీప్ కోరాడు.

నవదీప్ వైరల్ వీడియో ఇదే..

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. చాలా మంది నవదీప్ కు మద్దుతుగా నిలుస్తుంటే.. మరికొందరు మాత్రం సినిమా ప్రమోషన్ కోసం ఇలాంటి పనులు చేయాలా? అంటూ నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *