Headlines

PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ నిధుల విడుదలపై క్లారిటీ.. అకౌంట్లోకి రూ.2 వేలు అప్పుడే.. | PM Kisan 24th Installment: Rs 2000 to Farmers Likely in October, Check eKYC Status


పీఎం కిసాన్ డబ్బులు అకౌంట్లో ఎప్పుడు పడతాయనేది చాలామంది రైతులు ఎదురుచూస్తున్నారు. 23 విడత డబ్బులను ఈ ఏడాది జూన్‌లో జమ చేయగా.. 24 విడత డబ్బుల కోసం రైతులు చూస్తున్నారు. వానాకాలం సీజన్ మొదలుకావడంతో పంట సాగు కూడా మొదలుపెట్టారు. దీంతో పీఎం కిసాన్ సాయం కూడా నిరీక్షిస్తున్నారు. అయితే ఈ నిధులు అకౌంట్లో ఎప్పుడు పడతాయనే విషయంపై క్లారిటీ వచ్చింది. అక్టోబర్‌లో 24వ విడత నిధులను కేంద్రం జమ చేసే అవకాశముంది. ఈ విడత కింద అర్హులైన రైతుల ఖాతాల్లో రూ.2 వేలు జమ చేయనుంది. వీటిని నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్లలో వేయనుంది.

ప్రతీ ఏడాది రూ.6 వేలు..

సాధారణంగా ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి కేంద్రం నిధులు జమ చేస్తోంది. జూన్‌లో డబ్బులు జమ చేయడంతో నాలుగు నెలల తర్వాత అక్టోబర్ వస్తుంది. దీంతో అక్టోబర్‌లో నిధులను కేంద్రం జమ చేసే అవకాశముంది. ప్రతీ ఏడాది ఈ స్కీమ్ కింద కేంద్రం రూ.6 వేల ఆర్ధిక సాయం అందిస్తోంది. వీటిని మూడు విడతలుగా జమ చేస్తోంది. ఈ పథకం కింద దేశంలోని కోట్లాది మంది రైతులు లబ్ది పొందుతున్నారు. ఐదు ఎకరాల్లోపు పోలం ఉన్నవారికి ఈ పథకం వర్తిస్తుంది. కుటుంబంలో ఇద్దరి వ్యక్తులపై సాగు భూమి ఉంటే ఒక్కరికి మాత్రమే అందుతుంది. ఇక రేషన్ కార్డు వంటివి కలిగి ఉండాలి. అయితే 23వ విడత సమయంలో కొంతమంది రైతులు ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు. దీనికి ప్రధాన కారణం కేవైసీ పూర్తి చేయకపోవడమే. దీంతో కేవైసీ పెండింగ్‌లో ఉంటే డబ్బులు జమ అవ్వవు. పెండింగ్ ఉన్న రైతులు వెంటనే చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.

కేవైసీ పూర్తి చేయడం ఎలా..?

ఈకేవైసీని రెండు విధాలుగా పూర్తి చేయవచ్చు. పీఎం కిసాన్ వెబ్‌సైట్ సందర్శించి సులువుగా పూర్తి చేయవచ్చు. పీఎం కిసాన్ వెబ్‌సైట్లోకి వెళ్లి Farmers Corner ఆప్షన్ ఎంచుకోవాలి. అక్కడ eKYC ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అందులో ఆధార్ వివరాలు, క్యాప్చా ఎంటర్ చేయాలి. ఆధార్‌కు లింక్ అయిన మొబైల్‌ నెంబర్‌కు వచ్చే ఓటీపీని నమోదు చేయాలి. అనంతరం మీ కేవైసీ పూర్తవుతుంది. ఒకవేళ వెబ్‌సైట్ ద్వారా చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురైతే.. కామన్ సర్వీస్ సెంటర్ (CSC) లేదా మీ సేవా కేంద్రాల ద్వారా కూడా చేసుకోవచ్చు. గత ఏడతలో జమ కాకపోతే.. ఇఫ్పుడు కేవైసీ పూర్తి చేసుకోండి. 24వ విడతతో పాటు 23వ విడత డబ్బులు కూడా అకౌంట్లో జమ అవుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *