Headlines

Jabardasth: అన్నా ఆల్ ది బెస్ట్.. ‘జబర్దస్త్’ నుంచి మరో డైరెక్టర్.. సైలెంట్‌గా సినిమా పూర్తి చేసిన స్టార్ కమెడియన్ | Jabardasth Comedian Rocket Raghava Debut As Director With Alaa Alaa Jariginda Movie, Details Inside

Jabardasth: అన్నా ఆల్ ది బెస్ట్.. ‘జబర్దస్త్’ నుంచి మరో డైరెక్టర్.. సైలెంట్‌గా సినిమా పూర్తి చేసిన స్టార్ కమెడియన్ | Jabardasth Comedian Rocket Raghava Debut As Director With Alaa Alaa Jariginda Movie, Details Inside


ఒకప్పుడు జబర్దస్త్ షోలో కమెడియన్లుగా రాణించిన వారందరూ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నారు. హీరోలుగా, డైరెక్టర్లుగా, నిర్మాతలుగా, సహాయక నటులుగా, కమెడియన్లుగా తమ ప్రతిభను చాటుకుంటున్నారు.
సుడిగాలి సుధీర్, గెటప్ శీను, వేణు, హైపర్ ఆది, రామ్ ప్రసాద్, రాకింగ్ రాకేష్, ధనాధన్ ధన్ రాజ్, చమ్మక్ చంద్ర, అదిరే అభి, జీవన్, రాకెట్ రాఘవ.. ఇలా ఎంతో మంది జబర్దస్త్ ఆర్టిస్టులు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నారు. వీరిలో బలగం వేణు, ధనాధన్ ధన్ రాజ్, అదిరే అభి తదితరులు డైరెక్టర్లుగా రాణిస్తున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో మరో జబర్దస్త్ కమెడియన్ చేరనున్నాడు. జబర్దస్త్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఈ షోను అంటిపెట్టుకుని ఉన్న కమెడియన్లలో ఇతను కూడా ఒకడు. కేవలం జబర్దస్త్ మాత్రమే కాదు శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలోనూ ఈ కమెడియన్ సందడి చేస్తుంటాడు. తన నటనతో బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్విస్తుంటాడు. అప్పుడప్పుడు సినిమాల్లోనూ మెరుస్తోన్న ఈ స్టార్ కమెడియన్ ఇప్పుడు కెప్టెన్ కుర్చీలో కూర్చోబోతున్నాడు. ఇంతకీ అతనెవరనుకుంటున్నారా?

జబర్దస్త్ లో ఎక్కువగా స్కిట్స్ చేసింది ఎవరంటే రాకెట్ రాఘవ అనే చెప్పవచ్చు. ఇప్పటిదాకా జబర్దస్త్ కు ఎంతో మంది వచ్చారు. అలాగే ఎంతో మంది బయటకు వెళ్లిపోయారు. కానీ రాకెట్ రాఘవ మాత్రం చాలా ఏళ్లుగా ఈ షోలోనే కంటిన్యూ అవుతున్నాడు. అయితే ఇప్పుడీ కమెడియన్ డైరెక్టర్ గా మారిపోయాడు. అంతేకాదు సైలెంట్ గా ఒక సినిమాను కూడా పూర్తి చేశాడు రాఘవ. సత్యదేవ్ తో కలిసి ‘రావు బ‌హ‌దూర్’ ను తెరకెక్కించిన నిర్మాత‌ల్లో ఒక‌రైన చింతా గోపాల కృష్ణారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారట. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయట. తాజాగా ఈ సినిమా టైటిల్ ను అధికారికంగా ప్రకటించారు. ‘అలా అలా జరిగిందా?’ అనే పేరుతో తెరకెక్కిన ఈ సినిమాలో సాయి రోనక్, టీనా శ్రావ్య హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు రాకెట్ రాఘవ తాజాగా ఓ వీడియోను రిలీజ్ చేశాడు. దీంతో సినీ అభిమానులు ఈ జబర్దస్త్ నటుడికి ఆల్ ది బెస్ట్ చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి



తన మొదటి సినిమా అప్డేట్ఇస్తూ వీడియో రిలీజ్ చేసిన జబర్దస్త్ రాకెట్ రాఘవ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *