Headlines

Jabardasth Dhanraj: కర్మ ఎవ్వరినీ వదిలిపెట్టదు.. విలువ బ్రతికుండగానే తెలుసుకోవాలి: ధనరాజ్ | Jabardasth Dhanraj about the theory of karma and parental love


నరకం అనుభవిస్తున్నా..! ఎవరితో చెప్పుకోలేకపోతున్నా..!! కర్మ ఎవరినీ వదలదు..!” ఈ మాటలు తల్లిదండ్రులను కోల్పోయిన వారి ఆవేదనను, వారి విలువను గుర్తించని వారి భవిష్యత్తును ప్రతిబింబిస్తాయని జబర్దస్త్ నటుడు ధనరాజ్. గతంలో ఓ ఇంటర్వ్యూలో ధన రాజ్ మాట్లాడుతూ.. ఈ వీడియోలో, తల్లిదండ్రుల నిస్వార్థ ప్రేమ, వారి త్యాగాలు, వాటిని విస్మరించడం వల్ల కలిగే పరిణామాలు, కర్మ సిద్ధాంతంపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే ధనరాజ్ మాట్లాడుతూ.. మనిషి జీవితంలో నిస్వార్థ ప్రేమ కేవలం తల్లిదండ్రులదేనని, మిగతా అన్ని సంబంధాలు ఏదో ఒక ఆశతో, స్వార్థంతో ముడిపడి ఉంటాయని అన్నారు. పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు పడే కష్టాలు, చేసే త్యాగాలు ఎన్నో. చదువు చెప్పించడం, నడత నేర్పించడం, చివరకు ముక్కు చీమిడి తుడిచిన దగ్గరి నుంచి ప్రతి పనిలోనూ వారి ప్రేమ దాగి ఉంటుంది. అయితే, నేటితరం పిల్లలు చాలా మంది తల్లిదండ్రుల మాటలను లెక్క చేయకుండా, తమకే అన్నీ తెలుసని భావిస్తూ ఉంటారని.. ఒక ఐదు నిమిషాలు ఆలోచించి, తల్లిదండ్రులు చెప్పే దానిలో ఏమైనా పాయింట్ ఉందా అని చూసే ఓపిక కూడా ఉండటం లేదని ధనరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు.

నాకంటే అతనే బాగా సూట్ అవుతాడు..! బ్లాక్ బస్టర్ సినిమాను ఆ హీరోకు ఇచ్చేసిన సూపర్ స్టార్ కృష్ణ

అనాధాశ్రమాలు, వృద్ధాశ్రమాల పెరుగుదల ప్రస్తుత సామాజిక స్థితికి దర్పణం పడుతోందని.. కేవలం అనాధలు మాత్రమే కాకుండా, తల్లిదండ్రులున్న పిల్లలు, పిల్లలున్న తల్లిదండ్రులు కూడా ఈ ఆశ్రమాల్లో ఆశ్రయం పొందుతున్నారనే వాస్తవం మనసును కలచివేస్తుందని.. ఇది కేవలం ఆర్థిక సమస్య కాదని, కుటుంబ బంధాల విలువలు క్షీణించడమే దీనికి ప్రధాన కారణమని ధనరాజ్ స్పష్టం చేశారు. తమ కన్న తల్లిదండ్రులను వదిలేసిన వారు, లేదా కని వదిలేసిన వారు సమాజంలో ఎలా బ్రతకగలరని ప్రశ్నించారు. అనాధాశ్రమాలు, వృద్ధాశ్రమాలు ఉండటం గొప్ప విషయమా లేక వాటి ఆవిర్భావం బాధాకరమైన విషయమా అనేది అర్థం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు ధనరాజ్.

అంతగొప్ప వ్యక్తి మరణం నా సినిమాల మీద ప్రభావం చూపించింది.. ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది

తల్లిదండ్రులు మన జీవితంలో ఒకే ఒక పీస్ లాంటి వారని, దేవుడు మనకు ప్రసాదించిన అమ్మ, నాన్న మాత్రమే ప్రత్యేకమని గుర్తుచేశారు. ఈ ప్రపంచంలో మనం మళ్ళీ వెనక్కి వెళ్లి తీసుకురాలేని వారు వారేనని, వారి విలువను బతికుండగానే తెలుసుకోవాలని సూచించారు. తల్లిదండ్రులను కోల్పోయిన వారు అనుభవించే నరకాన్ని వ్యక్తిగత అనుభవంగా వివరించారు ధనరాజ్. ప్రతి క్షణం తల్లిదండ్రులు గుర్తుకు వస్తూ ఉండే బాధ వర్ణనాతీతమని తెలిపారు ధనరాజ్. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అలాగే ఈ నేపథ్యంలో, “కర్మ బూమరాంగ్, ఎవరినీ వదలదు” అని అన్నారు. నేడు తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే, రేపు అదే పరిస్థితి తమకు ఎదురవుతుందని, తమ పిల్లలు కూడా తమను అదే విధంగా చూస్తారని ధనరాజ్ అన్నారు.

ఇవి కూడా చదవండి



ఆ సినిమాలో ఛాన్స్ అడిగితే ఆ హీరో వద్దు అన్నారు.. షాకింగ్ విషయం చెప్పిన రాజశేఖర్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *