Headlines

Jabardasth Komaram: జబర్దస్త్‌లో నాకు లైఫ్ ఇచ్చి, అన్నం పెట్టింది ఆయనే.. ఆ అన్న వల్లే ఇప్పుడు ఇదంతా | Jabardasth fame Komaram Interesting comments about Kirak RP


జబర్దస్త్ నటుడు కొమరం ఇటీవల సినిమాల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నాడు. తాజాగా ఇరుముడి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు కొమరం. ఇప్పుడు వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. కాగా రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత అలాగే వృత్తిపరమైన ప్రయాణం గురించి మాట్లాడాడు. కొమరం తన జీవితంలో కిరాక్ ఆర్పీ పాత్రను ప్రస్తావిస్తూ, ఆయనకు గురువుతో సమానంగా గౌరవాన్ని వ్యక్తం చేశారు. “ఆర్పీ అన్నకు కూడా థ్యాంక్స్ అన్న. నిజంగానే కొట్టినా, తిట్టినా, మంచోడో చెడ్డోడో పక్కన పెడితే నాకు అన్నం పెట్టిన మనిషి ఆయన. చాలా మందికి లైఫ్ ఇచ్చాడు ఆర్పీ” అని కొమరం అన్నాడు. ఆర్పీ తన టీమ్ లీడర్‌గా నాలుగు సంవత్సరాలు తనపై కంటెంట్ రాశారని, ఆహారం విషయంలో, డబ్బు విషయంలో, అవకాశం ఇచ్చే విషయంలో ఆర్పీని “తోపు” అని కొమరం కొనియాడాడు. ఆర్పీ వ్యక్తిగత జీవితం గురించి తనకు సంబంధం లేదని, తనకు లైఫ్ ఇచ్చి, అన్నం పెట్టినందుకు అది చాలని ఆయన స్పష్టం చేశాడు.

మరో హీరోయిన్ అయితే నావల్ల కాదు అని చేతులెత్తేసేది.. కానీ ఆమె అలా కాదు

అయితే, జబర్దస్త్‌లోని కొంతమంది కళాకారుల ప్రవర్తనపై కొమరం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “రాజకీయం చేసిన వాళ్లతో జబర్దస్త్ లో ఉన్న ఆర్టిస్టులు కొంతమంది బిల్డప్ ఇచ్చి, షో చేసి అంటే  చెప్పాలంటే ఒక హీరోకన్నా ఎక్కువ బిల్డప్ ఇచ్చిన కమెడియన్స్ చాలామంది ఉన్నారు” అని ఆయన విమర్శించాడు. అలాంటి వారు తమ మూలాలను మరిచిపోయి, నాశనం అవుతున్నారని లేదా నాశనానికి సిద్ధంగా ఉన్నారని కొమరం అన్నాడు. స్టార్ హీరోల పేర్లు చెప్పుకొని బతికే బ్యాచ్‌లు, తమ చరిత్ర తెలిసిన వారి ముందు కూడా “షో” చేసే వారిని ఆయన తీవ్రంగా ఖండించాడు. తన జీవితంలో కొత్తగా వచ్చిన వారి ముందు బిల్డప్ ఇవ్వడం సరికాదని, తమ చరిత్ర తెలిసిన వారి దగ్గర షో చేస్తే తమ అంత పిచ్చివాళ్ళు ఇంకెవరూ ఉండరని కొమరం అన్నాడు.

నేను మాట్లాడిన మాట ప్రజల్లోకి వల్గర్‌గా వెళ్ళింది.. నా వల్ల ఆ స్టార్ డైరెక్టర్ మాటలు పడ్డారు..

తన గతాన్ని, కష్టాలను దాచుకోకుండా నిజాయితీగా ఉండటమే కొమరం నమ్మకం. “నేను బాత్రూమ్ లు కడిగిన ఇవన్నీ చేసినా తప్పేముంది?” అని ప్రశ్నిస్తూ, తన కష్టాన్ని, ఇష్టపడి చేసిన పనిని దాచుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నాడు. చిన్నప్పటి నుంచి తన జీవిత చరిత్ర తన క్లాస్‌మేట్స్‌కు, చుట్టాలకు తెలుసని, తాను ఉన్నది ఉన్నట్టు చెప్పడం వల్ల అవతలి వారు స్ఫూర్తి పొంది, “గిన్ని పనులు చేసినోడే సక్సెస్ అయిండు, మనమేందుకు కామురా” అని అనుకుంటారని ఆయన అభిప్రాయపడ్డాడు. “పని దేవుడు” అనే సిద్ధాంతాన్ని బలంగా నమ్మే కొమరం, గుడికి వెళ్లి భజన చేయడం కన్నా, శ్రద్ధగా పని చేసుకోవడం దేవుడికి ఇష్టమని చెప్పారు.

ఇవి కూడా చదవండి



ఆ సినిమా ఫ్లాప్ అవుతుందనుకోలేదు.. ఆ దెబ్బకు 3 నెలలు ఇంట్లో నుంచి బయటకు రాలేదు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *