Headlines

Jailer 2 Movie: అదిరిపోయింది భయ్యా.. పూర్ణ మత్తెక్కించే డ్యాన్స్.. అనిరుధ్ మ్యూజిక్.. జైలర్ 2 సాంగ్ ఇరగదీశారు.. | Ala Bolelo Song Released From Rajinikanth Jailer 2 Movie Starrer Poorna


సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, బ్లాక్‌బస్టర్ దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ చిత్రం ‘జైలర్ 2’. 2023లో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న జైలర్ చిత్రానికి సీక్వెల్ ఇది. అందుకే మొదటి నుంచి ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ క్షణాల్లో వైరలవుతున్నాయి. అయితే ఈ సినిమా నుంచి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫస్ట్ సింగిల్ ‘అలా బోలేలో’ (Ala Bolelo) పాటను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ స్వీయ దర్శకత్వంలో, తనదైన మార్క్ మాస్ బీట్లతో ఈ పాటను స్వరపరిచి ఆలపించారు. ఈ పాటలో నటి పూర్ణ (షామ్నా కాసిమ్) సాంప్రదాయ కేరళ చీరకట్టులో ఎంతో గ్లామరస్‌గా కనిపిస్తూ, అదిరిపోయే మాస్ డ్యాన్స్ మూవ్స్‌తో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. పూర్ణ డ్యాన్స్‌కు తోడు సూపర్ స్టార్ రజనీకాంత్ తనదైన స్వాగ్, స్టైలిష్ ప్రెజెన్స్‌తో ఈ పాటకు మరింత ఊపు తెచ్చారు.

ఎక్కువమంది చదివినవి : Hemachandra : శ్రావణ భార్గవితో విడాకులు ?.. రూమర్స్ పై స్పందించిన హేమచంద్ర.. ఏమన్నారంటే..

మొదటి భాగంలో తమన్నా నటించిన ‘నువ్వు కావాలయ్యా’ పాట పాన్-ఇండియా స్థాయిలో ఎంతటి ట్రెండ్ సెట్ చేసిందో అందరికీ తెలిసిందే. అదే తరహాలో ఓనం పండుగ కానుకగా మలయాళీ టచ్ ఇస్తూ ఈ ‘అలా బోలేలో’ పాటను రూపొందించారు. శ్రీనివాస మౌళి/అరుణ్‌రాజా కామరాజ్ అందించిన సాహిత్యం, అనిరుధ్ హై ఎనర్జిటిక్ వాయిస్ ఈ పాటను చార్ట్‌బస్టర్‌గా నిలబెట్టేలా ఉన్నాయి.

ఎక్కువమంది చదివినవి : Cinema : ఓటీటీలో వణుకు పుట్టించిన సస్పెన్స్ థ్రిల్లర్.. ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండింగ్.. మైండ్ బ్లాకింగ్ హారర్ మూవీ..

సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ, యోగి బాబు, మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఫస్ట్ సింగిల్‌తోనే ‘జైలర్ 2’ ప్రమోషన్లను మేకర్స్ గ్రాండ్‌గా షురూ చేశారు.

ఎక్కువమంది చదివినవి : Mokshagna : వారసుడు వచ్చేస్తున్నాడు.. దసరాకు మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరంటే..

అల బోలెలో సాంగ్…



ఎక్కువమంది చదివినవి : Jr.NTR : ఎన్టీఆర్‏తో చేసిన ఆ సినిమా ప్లాప్ కావడానికి కారణం అదే.. ఆ నిర్ణయమే పొరపాటు అయ్యింది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *