మిథునం: ఈ రాశికి ధన స్థానంలో ధన కారకుడు గురువు ఉచ్ఛస్థితిలో ఉండడంతో పాటు రాశ్యధిపతి బుధుడు కూడా ధన స్థానంలో ప్రవేశిస్తున్నందువల్ల ఈ రాశివారికి ఇది వరకటి కంటే ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడే అవకాశం ఉంది. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి అంచనాలను మించి లాభిస్తాయి. ఆస్తిపాస్తుల ద్వారా కూడా ఆర్థిక లాభం కలుగుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతాయి.
కర్కాటకం: ఈ రాశిలో గురువు ఉచ్ఛపట్టడంతో పాటు, లాభాధిపతి శుక్రుడు, ధనాధిపతి రవి అనుకూలంగా సంచారం చేయడం వల్ల ఈ రాశివారికి ఆగస్టు, సెప్టెంబర్ నెలలు ఆర్థికంగా బాగా కలిసి వస్తాయి. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. తేలికగా ఆదాయం లభించే అవకాశాలు కలుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లలో పెట్టుబడులు పెట్టి అత్యధికంగా లబ్ది పొందడం జరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది. అంతేకాక,లాటరీ గానీ, జాక్ పాట్ గానీ కొట్టే అవకాశం కూడా ఉంది.
కన్య: ఐశ్వర్యానికి కారకుడైన గురువు ఉచ్ఛ స్థితిలో ఉండడం, భోగభాగ్యాలకు కారకుడైన శుక్రుడు ఈ రాశిలో ప్రవేశించడం, రాశ్యధిపతి బుధుడు లాభ స్థానంలో సంచారం వంటి కారణాల వల్ల ఈ రాశి వారికి త్వరలో ఒకటికి రెండుసార్లు ధన యోగాలు పట్టే అవకాశం ఉంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, లాటరీలు, ఆర్థిక లావాదేవీలు అంచనాలకు మించి లాభిస్తాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమై ఆస్తి లాభం, భూ లాభం కలుగుతాయి. ఆస్తుల విలువ బాగా పెరుగుతుంది.
వృశ్చికం: ధన కారకుడు, ఈ రాశికి ధనాధిపతి అయిన గురువు భాగ్య స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉండడంతో పాటు, లాభస్థానాధిపతి బుధుడు లాభ స్థానంలో ప్రవేశిస్తున్నందువల్ల ఈ రాశివారికి జూలై చివరి వారం దగ్గర నుంచి ఒకటికి రెండుసార్లు ఊహించని ధన యోగాలు పట్టే అవకాశం ఉంది. శుక్ర బలం, కుజ బలం కూడా క్రమంగా పెరుగుతున్నందువల్ల ఆకస్మిక ధనలాభాలకు అవకాశం ఉంది. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. వివాదాలు పరిష్కారమై విలువైన ఆస్తి కలిసి వస్తుంది.
మకరం: ఈ రాశికి సప్తమ స్థానంలో గురువు ఉచ్ఛపట్టడం, ఆగస్టు మొదటి వారంలో బుధ, శుక్రులు అను కూల స్థానాల్లోకి మారడం వల్ల ఈ రాశివారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఒకటికి రెండు సార్లు ఆకస్మిక ధన లాభాలు కలిగే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి అంచనాలకు మించి లాభిస్తాయి. రావలసిన సొమ్ము పూర్తిగా చేతికి అందుతుంది. రాదనుకున్న డబ్బు, మొండి బాకీలను వసూలు చేసుకుంటారు. ఈ రాశివారికి లాటరీ ధనం లభించే అవకాశం ఉంది.
మీనం: రాశ్యధిపతి గురువు పంచమ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉండడం, ధన, భాగ్యాధిపతి కుజుడి అనుకూల సంచారం వల్ల ఈ రాశివారికి ఊహించని రీతిలో అనేక విధాలుగా ఆదాయం కలిసి వచ్చే అవకాశం ఉంది. సగటు వ్యక్తి సైతం సంపన్నుడు కావడం జరుగుతుంది. ఆస్తిపాస్తులు కలిసి రావడంతో పాటు పిత్రార్జితం కూడా లభిస్తుంది. లాటరీ తగిలే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. షేర్లు బాగా లాభిస్తాయి. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమవుతుంది.





