Headlines

Money Astrology: రుణ బాధల నుంచి బిగ్ రిలీఫ్..ఈ రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షం! | Exalted Jupiter in Cancer: These Zodiac Signs May Overcome Debt and Financial Problems

Money Astrology: రుణ బాధల నుంచి బిగ్ రిలీఫ్..ఈ రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షం! | Exalted Jupiter in Cancer: These Zodiac Signs May Overcome Debt and Financial Problems


జ్యోతిషశాస్త్రం ప్రకారం గురువుకు ఉచ్ఛ స్థితి కలిగినప్పుడు అనేక విధాలుగా సానుకూలతలు పెరుగుతాయి. అనుకూల స్థానాల్లో ఉన్నా, ప్రతికూల స్థానాల్లో ఉన్నా ఏదో విధంగా యోగం పట్టే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కర్కాటక రాశిలో అక్టోబర్ 31 వరకు ఉచ్ఛ స్థితిలో ఉంటున్న గురువు వల్ల కొన్ని రాశుల వారు రుణ, ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. గురువు అనుకూలంగా ఉన్న రాశులకు మరింత త్వరగా ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్లు పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకరం, మీన రాశుల వారికి గురువు అనుకూలత ఎక్కువగా ఉంది.

  1. మిథునం: ఈ రాశికి ధన కారకుడు గురువు ధన స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్నందువల్ల జూలై ఆఖరు నుంచి ఈ రాశివారికి రుణ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఒత్తిళ్లు ఉండే అవకాశం లేదు. స్వల్పకాలిక రుణాలు, చేబదుళ్లనే కాకుండా దీర్ఘకాలిక రుణాలను కూడా ఒక పద్ధతి ప్రకారం తీర్చేసే అవకాశం ఉంది. అదనపు ఆదాయ మార్గాలు, ఆర్థిక ప్రయత్నాల ద్వారా ఆదాయాన్ని పెంచుకుని, రుణ భారాన్ని తగ్గించుకోవడం జరుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.
  2. కర్కాటకం: ఈ రాశిలో గురువు ఉచ్ఛపట్టడంతో పాటు లాభాధిపతి శుక్రుడు అనుకూలంగా మారుతున్నందు వల్ల ఈ రాశివారికి ఒకటి రెండు నెలల్లో తప్పకుండా ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది. అనుకోకుండా జీతభత్యాలు పెరగడం, అదనపు ఆదాయ మార్గాలు విస్తరించడం, రావలసిన డబ్బు అందడం వంటివి జరిగి, వీరు ఒక ప్లాన్ ప్రకారం ఆర్థిక, రుణ సమస్యల నుంచి బయటపడే సూచనలున్నాయి. తల్లితండ్రుల నుంచి కూడా ఆశించిన ఆర్థిక సహకారం లభిస్తుంది.
  3. కన్య: ఈ రాశికి లాభ స్థానంలో గురువు ఉచ్ఛపట్టినందువల్ల ఉన్న అక్టోబర్ లోగా ఈ రాశివారికి తప్పకుండా రుణ భారం నుంచి విముక్తి కలిగే అవకాశం ఉంది. అనేక విధాలుగా ఆదాయం పెరిగి రుణ భారం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. సాధారణ రుణాలతో పాటు, దీర్ఘకాలిక రుణాల నుంచి సైతం బయటపడడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలపరంగా ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. అదనపు ఆదాయ మార్గాలు కూడా అంచనాలకు మించి కలిసి వస్తాయి.
  4. వృశ్చికం: ఈ రాశివారికి భాగ్య స్థానంలో ఉచ్ఛ గురువు సంచారం వల్ల ఆగస్టు నుంచి ఈ రాశివారికి రుణ సంబంధమైన ఒత్తిడి ఉండే అవకాశం లేదు. దీర్ఘకాలిక రుణమైనా, స్వల్పకాలిక రుణమైనా అతి త్వరలో తీరిపోయి మనశ్శాంతి కలుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయాన్ని పెంచుకోవడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశముంది. గృహ, వాహన రుణాల నుంచి కూడా పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. షేర్లు, ఆర్థిక లావాదేవీలు కూడా లాభించే అవకాశం ఉంది.
  5. ఇవి కూడా చదవండి



  6. మకరం: ఈ రాశికి గురువు సప్తమ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్నందువల్ల సమీప భవిష్యత్తులో ఈ రాశి వారికి ఆర్థిక సంబంధమైన సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. షేర్లు, స్పెక్యులే షన్లు, ఇతర ఆర్థిక లావాదేవీల వల్ల అంచనాలకు మించిన లాభాలు కలుగుతాయి. కొత్తగా రుణాలు తీసుకునే అవకాశం ఉండదు. గృహ, వాహన రుణాలు కూడా చాలావరకు తీరిపోయే అవ కాశం ఉంది. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరగడం వల్ల ఊరట కలుగుతుంది.
  7. మీనం: రాశ్యధిపతి గురువు ఈ రాశికి పంచమ స్థానంలో ఉచ్ఛ స్థితిలో సంచారం చేస్తున్నందువల్ల అక్టో బర్ చివరి వరకు ఈ రాశివారికి ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. ఫలితంగా రుణ సమస్యలు, ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయే అవకాశం ఉంది. ఆస్తులు కలిసి రావడంతో పాటు, అదనపు ఆదాయం పెరగడం వల్ల వీరు రుణ బాధల నుంచి బయటపడడం జరుగుతుంది. రావల సిన సొమ్ము చేతికి అందుతుంది. రుణ విముక్తిలో కుటుంబ సభ్యుల సాయం కూడా లభిస్తుంది.

Also Read: ఆగస్టు నుంచి వారికి అదృష్టం పట్టబోతోంది! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *