Headlines

OTT Movie: అప్పుడే ఓటీటీలోకి తమిళ సూపర్ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఇంటిల్లిపాది నవ్వుకోండిక | Vishnu Vishal And Aishwarya Lekshmi Stareer Gatta Kusthi 2 Movie To Stream On Netflix OTT From July 31st

OTT Movie: అప్పుడే ఓటీటీలోకి తమిళ సూపర్ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఇంటిల్లిపాది నవ్వుకోండిక | Vishnu Vishal And Aishwarya Lekshmi Stareer Gatta Kusthi 2 Movie To Stream On Netflix OTT From July 31st


కోలీవుడ్ లో డిఫరెంట్ స్టోరీలతో సినిమాలు చేస్తూ విజయాలు అందుకుంటున్నాడు విష్ణు విశాల్. తెలుగులోనూ ఈ నటుడి సినిమాలు డబ్బింగ్ అవుతుంటాయి. అలా 2022లో విష్ణు విశాల్ నటించిన చిత్రం గట్టా కుస్తీ సూపర్ హిట్ గా నిలిచింది. తెలుగులోనూ మట్టి కుస్తీ పేరుతో రిలీజై సంచలన విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు భారీ వసూళ్లు వచ్చాయి. ముఖ్యంగా ఓటీటీలో అయితే తెలుగు ఆడియెన్స్ ఈ సినిమాను తెగ చూసేశారు. ఇప్పుడు ఈ సూపర్ హిట్ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన సినిమానే ‘గట్టా కుస్తీ 2’. జులై 03న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద 50 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. అయితే వివిధ కారణాల వల్ల ఈ సినిమా తెలుగులో రిలీజ్ కాలేదు. కానీ ఇప్పుడు తెలుగులో చూసే అవకాశం వచ్చింది. థియేటర్లలో ఆడియెన్స్ ను ఆకట్టుకున్న గట్టా కుస్తీ 2 ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. తాజాగా దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది.

గట్టా కుస్తీ 2 సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో జులై 31 నుంచి ఈ క్రేజీ సీక్వెల్ ఓటీటీలోకి రానుంది. ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ మలయాళంలోనూ ఈ సూపర్ హిట్ సినిమా స్ట్రీమింగ్ కు రానుంది. ఇక గట్టా కుస్తీ 2 సినిమా విషయానికి వస్తే.. దర్శకుడు చెల్లా అయ్యావు తెరకెక్కించిన ఈ స్పోర్ట్స్ కామెడీ ఎంటర్ టైనర్ లో విష్ణు విశాల్‌ సరసన ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటించింది. వేల్స్ ఫిల్మ్ ఎంటర్ టైన్మెంట్, ఐవీవై ఎంటర్ టైన్మెంట్, విష్ణు విశాల్ స్టూడియోజ్ బ్యానర్లపై ఇషారి కే. గణేష్, విష్ణు విశాల్, ఇషాన్ సక్సేనా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. రమ్యకృష్ణ, యోగిబాబు, కరుణాస్, మునికాంత్, కాళీ వెంకట్, లిజీ ఆంటోని, శ్రీజా రవి తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. సీన్ రోల్డాన్ ఈ మూవీకి సంగీతం అందించారు. మరి థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి



మరో రెండు రోజుల్లో ఓటీటీలోకి గట్టా కుస్తీ 2

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *