Headlines

OTT Movie: ఆ అమ్మాయిని ఎవరు చంపారు? ఓటీటీ టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది | Must Watch Movie In OTT: Malayalam Crime Thriller Unmadham Movie Is Now Trending Top On Sony LIV OTT


ప్రస్తుతం మలయాళం సినిమాలకు ఉన్న క్రేజ్, ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ ఓటీటీలో అయితే ఈ మాలీవుడ్ సినిమాలను ఎగబడి చూస్తున్నారు ఆడియెన్స్. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగానే వివిధ ఓటీటీ సంస్థలు కూడా ప్రతివారం రెండు, మూడు మలయాళం సినిమాలను తెలుగులోకి అనువాదం చేసి మరీ స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా ఒక మలయాళం మూవీనే. అందులోనూ ప్రజెంట్ ట్రెండ్ అయిన క్రైమ్ థ్రిల్లర్ జానర్ కు చెందిన మూవీ. థియేటర్లలో సంచలన విజయం సాధించిన ఈ మూవీ గత వారమే ఓటీటీలోకి వచ్చింది. ఇప్పుడు సదరు ఓటీటీ ప్లాట్ ఫామ్ లో టాప్ లో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే..’ కానిస్టేబుల్ షెల్లీకి సినిమాలంటే ఎంతో ఇష్టం. ఇండస్ట్రీలో మంచి రైటర్ కావాలని కలలు కంటాడు. అయితే ఫ్యామిలీ పరిస్థితుల కారణంగా కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరతాడు. భార్య సౌమ్య కూడా ఓ ప్రైవేట్ సంస్థలో వర్క్ చేస్తూ భర్తకు చేదోడు వాదోడుగా ఉంటుంది. ఓ వైపు పోలీస్ జాబ్ చేస్తూనే మరో వైపు సినిమా కథలు రాస్తుంటాడు షెల్లీ. అయితే ఎన్ని కథలు రాసినా అవి సినిమాలుగా పట్టాలెక్కవు. దీంతో నిరాశకు లోనవుతాడు. ఇదే క్రమంలో ఆరేళ్ల క్రితం చనిపోయిన ఓ యువతి మర్డర్ కేసు గురించి షెల్లీకి తెలుస్తుంది. ఆ కేస్ నెం.174 ఫైల్ ఎవరు ఓపెన్ చేసినా ఆ రోజు వాళ్లు రక్తం కళ్ల జూస్తారు. దీంతో అందరూ ఆ కేస్ ఫైల్‌ను శాపగ్రస్త కేసుగా భావిస్తారు. దీంతో ఈ కేసును ఎలాగైనా టేకప్ చేసి దానినే సినిమా స్టోరీగా తీసుకురావాలని అనుకుంటాడు. అనుకున్నదే తడవుగా దర్యాప్తు ప్రారంభిస్తాడు. అయితే విచారణలో ఊహించని అనుభవాలు ఎదురవుతాయి. అసలు ఆ కేస్ ఫైల్ ఏంటి? ఇన్వెస్టిగేషన్‌లో ఎదురైన సవాళ్లను షెల్లీ ఎలా ఎదుర్కొన్నాడు? ఆ యువతి ఎలా చనిపోయింది? దీని వెనుక ఉన్నది ఎవరు? తెలియాలంటే ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూడాల్సిందే.

ప్రస్తుతం ఓటీటీలో టాప్ ట్రెండింగ్ లో ఉన్న సినిమా పేరు ‘ఉన్మాదం’. నాయట్టు, ఆఫీసర్ ఆన్ డ్యూటీ తదితర సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు బాగా దగ్గరైన కుంచకో బోబన్ ఈ సినిమాలో హీరోగా నటించాడు. పోలీస్ ఆఫీసర్, ‘నాయట్టు’, ‘జోసెఫ్’ లాంటి సూపర్ హిట్ చిత్రాలకు కథ అందించిన షాహి కబీర్ ఈ సినిమాకు స్టోరీ సమకూర్చగా, ప్రముఖ ఎడిటర్ కిరణ్ దాస్ దర్శకత్వం వహించారు. జై భీమ్’ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి లిజోమోల్ జోస్ ఇందులో పోలీసాఫీసర్ భార్య పాత్రలో అద్భుతంగా నటించింది. అలాగే సిద్ధిక్, సుధీష్, సాబుమోన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. దాదాపు 143 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమా ప్రస్తుతం సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఒరిజినల్ మలయాళం వెర్షన్ తో పాటు తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. మంచి క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూడాలనుకునేవారికి ఈ మూవీ ఒక మంచి ఛాయిస్ అని చెప్పుకోవచ్చు.

ఇవి కూడా చదవండి



సోనీ లివ్ లో ఉన్మాదం సినిమా..

ఉన్మాదం సినిమా ట్రైలర్..



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *