Headlines

OTT Movie: పగలు సాధువులు, రాత్రికి సైకోలు..ఓటీటీలో దుమ్మురేపుతోన్న తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. 8.3/10 రేటింగ్ | Must Watch In OTT: Venkat Starrer Telugu Crime Thriller Harudu Movie Is Now Streaming On Aha


ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీలో ఆసక్తికరమైన సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రాబోతున్నాయి. థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన కొరియన్ కనకరాజు, డీసీ, ఉన్మాదం తదితర సినిమాలు ఈ వారం స్ట్రీమింగ్ లిస్టులో ఉన్నాయి. అలాగే ‘జగమే సంగీతం’ వంటి వెబ్ సిరీస్ లు కూడా ఓటీటీ ఆడియెన్స్ కు వినోదం పంచుతున్నాయి. అయితే వీటి సంగతి పక్కన పెడితే.. గత వారమే ఓటీటీలోకి వచ్చిన ఓ సినిమా ఇప్పుడు ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంటోంది. భారీ వ్యూయర్ షిప్ తో టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఇదొక తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా. కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాగానే ఆడింది.మరీ సూపర్ హిట్ అవ్వలేదు కానీ ఓ మోస్తరు కలెక్షన్లు తెచ్చుకుంది. అయితే ఐఎమ్‌డీబీలో మాత్రం 8.4 రేటింగ్‌ను సొంతం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. ముంబై నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. నగరంలో ఉన్నట్లుండి వరుస హత్యలు కలకలం రేపుతాయి. ప్రముఖులు వరుసగా శవాలై తేలుతుంటారు. దీంతో ఈ మర్డర్ మిస్టరీ ఏంటో తెలసుకోలేక పోలీసులు తలలు పట్టుకుంటారు. చివరకు ఓ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌ను ఈ కేసు కోసం నియమిస్తారు. విచారణలో ఒళ్లు గగుర్పొడిచే భయంకరమైన నిజాలు ఒక్కొక్కటిగా బయటపడటతాయి. సమాజంలో చాలా గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్న కొందరు వ్యక్తులే ఈ క్రూరమైన హత్యలకు కారణమని తెలుసుకుంటారు. మరి ఆ సైకో గ్యాంగ్ ఎవరు? వారు ఈ విధంగా వరుస హత్యలు చేయడానికి గల కారణం ఏంటి? పోలీసులు వారిని ఎలా పట్టుకున్నారన్నది తెలుసుకోవాలంటే ఈ క్రైమ్ థ్రిల్లర సినిమా చూడాల్సిందే.

ప్రస్తుతం ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న ఈ సినిమా పేరు హరుడు. ఒకప్పుడు ఆనందం వంటి సూపర్ హిట్ సినిమాల్లో హీరోగా నటించిన వెంకట్ ఈ సినిమాలో మెయిన్ రోల్ చేశాడు. రాజ్ తాళ్లూరి తెరకెక్కించిన ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ లో హెబ్బా పటేల్, సలోని అశ్విని, రవి వర్మ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. థియేటర్లలో ఆడియెన్స్ కు మంచి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ అందించిన హరుడు సినిమా ఇప్పుడు ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో మంచి క్రైమ్ థ్రిల్లర్ సినిమా కానీ వెబ్ సిరీస్ కానీ చూడాలనుకుంటున్నారా? అయితే హరుడు సినిమాపై ఒక లుక్కేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి



ఆహాలో హరుడు సినిమా..

హరుడు సినిమా ట్రైలర్..



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *