ప్రస్తుతం ఓటీటీల్లో పలు సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు సందడి చేస్తున్నాయి. అఖిల్ అక్కినేని లెనిన్, విజయ్ ఆంటోని వంద దేవుళ్లు, ఐశ్వర్యా రాజేష్ సుకుమారి, హృదయం మురళి, ఉయిర్, సెకెండ్ కేస్ ఆఫ్ సీతారం వంటి సినిమాలతో పాటు ఆఫరేషన్ సఫేద్ సాగర్, వదంతి సీజన్ 2 వంటి వెబ్ సిరీస్ లు కూడా ఓటీటీ ఆడియెన్స్ కు మంచి వినోదాన్ని పంచుతున్నాయి. అయితే వీటి మధ్య రెండు వారాల క్రితం ఓటీటీలోకి వచ్చిన ఓ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ ఇప్పుడు ట్రెండింగ్ లో నంబర్ వన్ గా దూసుకెళ్లిపోతోంది. ఇప్పటికే ఓటీటీలో ఈ సినిమా 50 మిలియన్స్ ప్లస్ స్ట్రీమింగ్ మినిట్స్ ను దాటేసిందని అధికారిక ప్రకటన వెలువడింది. అంతకు ముందు ఈ ఏడాది ఏప్రిల్ లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లనే రాబట్టింది. ఇప్పుడు ఓటీటీలోనూ రికార్డు వ్యూయర్ షిప్ తో దూసుకుపోతోంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ విషయానికి వస్తే.. ఏపీలోని కాకినాడ నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుంది. ఆ ప్రాంతంలో భగవంత్ రాజు ఓ పేరు మోసిన రౌడీ షీటర్ ఉంటాడు. పొలిటికల్ గానూ పవర్ పెంచుకునేందుకు కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటాడు.అయితే అదే సీటు కోసం అక్కడే ఉన్న దుర్గ కూడా పోటీకి దిగుతాడు. దీంతో ఇద్దరి మధ్య పొలిటికల్ వార్ పీక్స్ కు చేరుకుంటుంది. అయితే ఒక రోజు రాత్రి ఉన్నట్లుండి భగవంత్ రాజు దారుణ హత్యకు గురువుతాడు. దీంతో సాధారణంగానే పోలీసుల అనుమానం ప్రత్యర్థులపైకి వెళుతుంది. అయితే అసలు ట్విస్ట్ అక్కడే ఉంది. మరి భగవంత్ రాజును చంపిందెవరు? ఈ హత్య వెనక ఉన్న ప్రధాన సూత్రధారులెవరు? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ప్రస్తుతం ఓటీటీ లో దూసుకుపోతోన్న ఈ సినిమా పేరు గేదెల రాజు.. కాకినాడ తాలుకా. చైతన్య మోటూరి తెరకెక్కించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ లో ప్రముఖ సింగర్ రఘు కుంచే ప్రధాన పాత్ర పోషించాడు. అలాగే వికాస్ ముప్పాల, టీనా శ్రావ్య, మౌనిక, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. రఘు కుంచెనే మ్యూజిక్ అందించగా… వాణి రవికుమార్ మోటూరి నిర్మించారు. కథ సింపుల్ గా ఉన్న ఇందులోని ట్విస్టులు ఆడియెన్స్ కు మతిపోగొడుతాయి. అలాగే స్క్రీన్ ప్లే, బీజీఎమ్ కూడా ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా రెండు ఓటీటీల్లో అందుబాటులో ఉంది. తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాతో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియోలనూ ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వీకెండ్ లో ఓటీటీలో మంచి యాక్షన్ థ్రిల్లర్ సినిమా లేదా సిరీస్ చూడాలనుకునేవారికి గగేదెల రాజు ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.
ఇవి కూడా చదవండి
రెండు ఓటీటీల్లో గేదెల రాజు స్ట్రీమింగ్..
గేదెల రాజు సినిమా ట్రైలర్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి