బియ్యానికి పురుగులు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? వేపాకు పని చేస్తుందా..? | Rice Worms: Causes, Health Risks Effective Prevention Methods Keep Rice Pest Free
ఇంట్లో వంటకు సిద్ధమయ్యే ముందు బియ్యాన్ని చెరగడం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. బియ్యానికి పురుగు పట్టినా లేదా అందులో మట్టి వంటి వ్యర్థాలు ఉన్నా వాటిని వేరు చేయడానికి చెరుగుతూ ఉంటారు. చాలామంది బియ్యాన్ని దీర్ఘకాలం నిల్వ చేసుకుంటారు. ఇలా నిల్వ చేసుకునే బియ్యానికి పురుగులు పట్టడం సాధారణంగా చూస్తుంటాం. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ వెలువరించే పాడి పంటలు పత్రిక ప్రకారం, నిల్వ చేసిన ధాన్యాలకు సాధారణంగా నుసి పురుగులు, ముక్కు పురుగులు, లద్దె పురుగులు…