నిమ్స్‌లో మరో చారిత్రక ఘట్టం..కేవలం 2 గంటల్లోనే బ్రెయిన్ సర్జరీలు | NIMS Hyderabad Cuts Deep Brain Stimulation Surgery Time to Just 1–2 Hours
హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూరోసర్జరీ విభాగం ఫంక్షనల్ న్యూరోసర్జరీ రంగంలో మరో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. న్యూరోసర్జరీ విభాగాధిపతి ప్రొఫెసర్ డా. వై. వంశీ కృష్ణ నాయకత్వంలో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ శస్త్రచికిత్సల వ్యవధిని 5–6 గంటల నుంచి కేవలం 1–2 గంటలకు తగ్గిస్తూ అత్యాధునిక విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. ఇప్పటివరకు పార్కిన్సన్స్ వ్యాధి, ఎసెన్షియల్ ట్రెమర్, డిస్టోనియా వంటి మూవ్‌మెంట్ డిజార్డర్లకు చేసే DBS శస్త్రచికిత్సల్లో రోగులు పలుగంటల…