పేపర్ లీక్ మాఫియాపై కేంద్రం సర్జికల్ స్ట్రైక్: రూ.10 కోట్ల జరిమానా.. 3 నెలల్లోనే శిక్ష! | Center to Toughen Anti Paper Leak Law: Up to rs 10 Cr Fine, STF Probe in 2 Months, and Fast Track Verdicts in 90 Days, Say Sources
దేశంలో పోటీ పరీక్షల విశ్వసనీయతను కాపాడేందుకు, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునే పేపర్ లీక్ మాఫియాపై కేంద్ర ప్రభుత్వం అత్యంత కఠినమైన చర్యలకు శ్రీకారం చుట్టింది. 1986 నాటి జాతీయ విద్యా విధానం పేపర్ లీకేజీలపై చట్టం తేవాలని సూచించినప్పటికీ, 2024లో మోదీ ప్రభుత్వం తొలిసారిగా ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) యాక్ట్ – 2024’ ను అమల్లోకి తెచ్చింది. తాజాగా ఈ చట్టాన్ని మరింత పటిష్టం చేస్తూ, అక్రమార్కుల గుండెల్లో రైళ్లు…