Headlines

తెలంగాణ పోలీసులపై మహారాష్ట్రలో దాడి.. బేడీలతోనే దొంగ పరార్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. | Telangana Police Attack in Maharashtra: Theft Accused Escapes in Handcuffs, 12 Arrested

మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లాలో తెలంగాణ పోలీసుల బృందంపై ఓ గుంపు దాడికి పాల్పడింది. ఓ చోరీ కేసులో అదుపులోకి తీసుకున్న నిందితుడిని ఆదిలాబాద్ జిల్లాకు తరలిస్తుండగా.. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు చిక్లీ ఎక్స్ రోడ్డు వద్ద ఆదిలాబాద్ జిల్లా పోలీసులపై నిందితుడి తరుపు బంధువులు, అనుచరులు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. రాళ్లు కర్రలతో పోలీసు వాహనంపై విరుచుకుపడ్డారు. ప్రాణరక్షణ కోసం ఆదిలాబాద్ జిల్లా పోలీసులు గాల్లోకి కాల్పులు జరపడటంతో దాడికి పాల్పడ్డ మూక పరారైంది. ఇదే సమయంలో…

Read Full News
నాగుపాము పడగపై కనిపించే ఆ సింబల్ ఏంటి? వెనుక ఉన్న ఆసక్తికరమైన రహస్యం ఇదే! | Why does cobra have spectacle mark on hood

నాగుపాము పడగపై కనిపించే ఆ సింబల్ ఏంటి? వెనుక ఉన్న ఆసక్తికరమైన రహస్యం ఇదే! | Why does cobra have spectacle mark on hood

నాగుపాము పడగ విప్పి నిలబడితే చూపు ముందుగా దాని కళ్లపైకి వెళ్తుంది. కానీ పడగ వెనుక కనిపించే ప్రత్యేకమైన గుర్తు మాత్రం చాలామందిని ఆసక్తికి గురిచేస్తుంది. రెండు కళ్లద్దాల్లా కనిపించే ఆ గుర్తును చూసి.. పాము తలపై ఏదైనా ప్రత్యేకమైన సింబల్ ఉంటుందా? అని అనుకుంటారు. నిజానికి అది ప్రకృతి ఇచ్చిన అద్భుతమైన గుర్తు. భారతీయ నాగుపాము (Spectacled Cobra) పడగ వెనుక కనిపించే ఈ నమూనాను సాధారణంగా ‘స్పెక్టకిల్ మార్క్’ అని పిలుస్తారు. రెండు వృత్తాకార…

Read Full News

Tollywood: ఎన్టీఆర్ విష్ణుమూర్తి పాత్ర.. ఆ నాలుగింటిలో రెండు చేతులు ఎవరివంటే..? | NTRs Vishnu Avatars: The Untold Story of Jaya Rami Reddys Hands

తెలుగు సినిమా చరిత్రలో నటరత్న నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) స్థానం అద్వితీయం. ముఖ్యంగా పౌరాణిక పాత్రలకు, దైవాల గెటప్‌లకు ఆయన పర్యాయపదంగా నిలిచారు. శ్రీకృష్ణుడి పాత్రను ఎన్నో చిత్రాల్లో పోషించి కృష్ణుడు అంటే ఎన్టీఆరే అన్నంతగా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఆయన మరికొన్ని సినిమాల్లో విష్ణుమూర్తి గెటప్‌లోనూ దర్శనమిచ్చారు. సాధారణంగా విష్ణుమూర్తిని నాలుగు చేతులతో చిత్రీకరిస్తారు. మరి ఎన్టీఆర్ విష్ణు గెటప్‌లో కనిపించినప్పుడు ఈ అదనపు రెండు చేతులను ఎలా నిర్వహించారు అనే ప్రశ్న చాలా…

Read Full News
OTT Movie: అప్పుడే ఓటీటీలోకి తమిళ సూపర్ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఇంటిల్లిపాది నవ్వుకోండిక | Vishnu Vishal And Aishwarya Lekshmi Stareer Gatta Kusthi 2 Movie To Stream On Netflix OTT From July 31st

కోలీవుడ్ లో డిఫరెంట్ స్టోరీలతో సినిమాలు చేస్తూ విజయాలు అందుకుంటున్నాడు విష్ణు విశాల్. తెలుగులోనూ ఈ నటుడి సినిమాలు డబ్బింగ్ అవుతుంటాయి. అలా 2022లో విష్ణు విశాల్ నటించిన చిత్రం గట్టా కుస్తీ సూపర్ హిట్ గా నిలిచింది. తెలుగులోనూ మట్టి కుస్తీ పేరుతో రిలీజై సంచలన విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు భారీ వసూళ్లు వచ్చాయి. ముఖ్యంగా ఓటీటీలో అయితే తెలుగు ఆడియెన్స్ ఈ సినిమాను తెగ చూసేశారు. ఇప్పుడు ఈ సూపర్…

Read Full News
Kia EV: 39 నిమిషాల్లో ఛార్జింగ్.. 526 కిలోమీటర్ల రేంజ్.. అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కియా ఎస్‌యూవీ | Kia Syros EV: 526KM range, charges in 39 minutes, cheapest electric Kia SUV launched

Kia EV: 39 నిమిషాల్లో ఛార్జింగ్.. 526 కిలోమీటర్ల రేంజ్.. అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కియా ఎస్‌యూవీ | Kia Syros EV: 526KM range, charges in 39 minutes, cheapest electric Kia SUV launched

Kia Electric Car: కియా తన కొత్త, అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారును భారత మార్కెట్లో విడుదల చేసింది. కియా సైరోస్ EV శక్తివంతమైన ఫీచర్లతో వస్తుంది. కంపెనీ కొన్ని రోజుల క్రితం ఈ SUVని ఆవిష్కరించింది. ఇప్పుడు దీని ధరలను కూడా ప్రకటించారు. కొత్త కియా సైరోస్ డెలివరీలు జూలై 30న ప్రారంభమవుతాయి. ఈ కారు 42kWh, 51.4kWh అనే రెండు బ్యాటరీ ఆప్షన్‌లతో వస్తుంది. ఈ కారు డిజైన్ దాని ICE (ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్)…

Read Full News
రాహువు ఆట మొదలు.. వీరికి దిన దిన గండమే! | Rahu Retrogression: 5 Zodiac Signs Face Major Troubles and Financial Issues

రాహువు ఆట మొదలు.. వీరికి దిన దిన గండమే! | Rahu Retrogression: 5 Zodiac Signs Face Major Troubles and Financial Issues

మకర రాశి : మకర రాశి వారి ఆదాయం అనుకోని విధంగా చేతికి అందినా, దానిని చాలా వేగంగా ఖర్చు పెడుతారు. అంతే కాకుండా పెట్టుబడుల విషయంలో కూడా చాలా సమస్యలు తలెత్తుతాయి. ఆర్థికపరమైన విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే, అంత మంచిది. అప్పులు ఎక్కువ అవుతాయి. పెట్టుబడులు పెట్టే ఆలోచన ఉంటే వదిలేయడం మంచిది. ఏ పని చేసినా ఆచీ తూచి అడుగు వేయడం వలన కొంత వరకు సానుకూల ఫలితాలను పొందుతారు.

Read Full News
కుంభ రాశి ఆగస్టు 2026 మాసఫలాలు: ఉద్యోగంలో ప్రాధాన్యం, ఆదాయ స్థిరత్వం | Aquarius Monthly Horoscope August 2026: Career Growth, Stable Income and Positive Family Support

కుంభ రాశి ఆగస్టు 2026 మాసఫలాలు: ఉద్యోగంలో ప్రాధాన్యం, ఆదాయ స్థిరత్వం | Aquarius Monthly Horoscope August 2026: Career Growth, Stable Income and Positive Family Support

ఆగస్టు 2026లో కుంభ రాశి వారికి శని, కుజుడు, రవి అనుకూల స్థానాల్లో సంచరించడం వల్ల ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో శుభ ఫలితాలు కనిపించే అవకాశం ఉంది. బుధుడి అనుకూల ప్రభావం వల్ల సమయస్ఫూర్తితో వ్యవహరించి వ్యక్తిగత సమస్యలకు సరైన పరిష్కారాలు కనుగొంటారు. కార్యాలయంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించి బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. అధికార యోగం లేదా పదోన్నతి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వృత్తి, వ్యాపారాల్లో స్థిరమైన పురోగతి కొనసాగుతుంది. వ్యాపారులకు కొత్త…

Read Full News
భారత్ – అమెరికా బంధానికి కొత్త బలం.. రక్షణ, అణుశక్తి, ఏఐ రంగాల్లో సంయుక్త కార్యాచరణ! | US India Boost Defense Civil Nuclear AI Cooperation for Economic Growth Jobs

భారత్ – అమెరికా బంధానికి కొత్త బలం.. రక్షణ, అణుశక్తి, ఏఐ రంగాల్లో సంయుక్త కార్యాచరణ! | US India Boost Defense Civil Nuclear AI Cooperation for Economic Growth Jobs

భారత్–అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం కానుందని అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ సెక్రటరీ ఎస్. పాల్ కపూర్ స్పష్టం చేశారు. రక్షణ, అణుశక్తి, సురక్షిత కృత్రిమ మేధ (AI), ఆధునిక సాంకేతికతల రంగాల్లో ఇరు దేశాలు మరింత సన్నిహితంగా కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. హూవర్ ఇన్‌స్టిట్యూషన్‌లో భారత్‌పై నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి అమెరికా మాజీ విదేశాంగ కార్యదర్శి కాండోలీజా రైస్, భారతదేశంలో అమెరికా మాజీ రాయబారి డేవిడ్…

Read Full News
ఇన్నాళ్లూ పొరపాటు చేశామా.. మటన్ లివర్ vs చికెన్ లివర్ గురించి ఈ నిజాలు తెలుసుకోండి..

ఇన్నాళ్లూ పొరపాటు చేశామా.. మటన్ లివర్ vs చికెన్ లివర్ గురించి ఈ నిజాలు తెలుసుకోండి..

నాన్‌వెజ్ ప్రియులకు ముక్క లేనిదే ముద్ద దిగదు. చికెన్, మటన్ ఎలాగూ క్రేజీ ఆప్షన్లే.. కానీ చాలామంది ప్లేట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది మాత్రం లివర్ ఫ్రై లేదా లివర్ కాలేయ మసాలా. వంటకాల్లో ప్రత్యేకమైన రుచిని అందించడమే కాదు ఆరోగ్యపరంగానూ లివర్ ఒక పవర్‌హౌస్. అయితే మాంసం షాప్‌కి వెళ్లగానే చాలామందికి వచ్చే బిగ్గెస్ట్ డౌట్..మటన్ లివర్ తీసుకెళ్లాలా? లేక చికెన్ లివర్ తీసుకోవాలా? అని.. చికెన్ లివర్‌తో పోలిస్తే మటన్ లివర్ ధర కాస్త…

Read Full News
వరదలకు చెక్ పెట్టేందుకు విజయవాడ అధికారుల వినూత్న ప్లాన్.. కాలువల్లో పడవ ప్రయాణం! | Vijayawada Civic Body Launches Boat Based Awareness Campaign to Keep Canals Clean and Prevent Urban Flooding

వరదలకు చెక్ పెట్టేందుకు విజయవాడ అధికారుల వినూత్న ప్లాన్.. కాలువల్లో పడవ ప్రయాణం! | Vijayawada Civic Body Launches Boat Based Awareness Campaign to Keep Canals Clean and Prevent Urban Flooding

కాలువలు చెత్తతో నిండిపోవడం వల్ల వర్షపు నీటి ప్రవాహానికి తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. ఫలితంగా భారీ వర్షాలు కురిసినప్పుడు నీరు బయటకు వెళ్లే మార్గం లేక రోడ్లు, కాలనీలు జలమయం అవుతున్నాయి. నీరు నిల్వ ఉండటంతో దోమలు విపరీతంగా పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం కూడా అధికమవుతోంది. అందుకే కాలువలను చెత్తకుండీలుగా కాకుండా నీటి ప్రవాహ మార్గాలుగా కాపాడాలని అధికారులు సూచించారు. ఈ సందర్భంగా క్యాచ్ ది రైన్ కార్యక్రమంపై కూడా విస్తృతంగా…

Read Full News