Headlines

Prarthna Chhabria: ఏవియేషన్ టు సిల్వర్ స్క్రీన్.. హీరోయిన్‌గా ప్రార్థనా ఛాబ్రియా.. ఈ బ్యూటీ జర్నీ ఇంట్రెస్టింగ్ | Interesting Journey Of Chiro Movie Heroine Prarthna Chhabria Who Is Coming From The Aviation Sector


విమానాల్లో ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చిన ఓ ట్రైనర్ గ్రేడ్ మహిళా పైలట్.. ఇప్పుడు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకునేందుకు వెండితెర వైపు అడుగులేస్తున్నారు. ఆమె పేరే ప్రార్థనా చాబ్రియా. కోలీవుడ్‌లో తెరకెక్కుతున్న ‘చిరో’ అనే మూవీ ద్వారా ఆమె హీరోయిన్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. పండుగ కానుకగా ఈ ఏడాదే ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురావడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుండటంతో, పైలట్ నుంచి నటిగా మారిన ఆమె ప్రయాణంపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కేవలం గ్లామర్ కోసమే కాకుండా, నటనలో ప్రత్యేకంగా మెళకువలు నేర్చుకున్న తర్వాతే ఆమె ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ప్రముఖ యాక్టింగ్ స్కూల్ ‘ఆది శక్తి’లో శిక్షణ తీసుకున్న ప్రార్థన, ఎలాంటి పాత్రకైనా ప్రాణం పోయగలనని చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. నటనతో పాటే బెల్లీ డ్యాన్స్, పోల్ డ్యాన్స్‌లలో కూడా ఆమెకు మంచి పట్టు ఉంది. కాబట్టి గ్లామరస్ రోల్స్‌తో పాటు మోడ్రన్, ట్రెడిషనల్ క్యారెక్టర్స్ కూడా చాలా ఈజీగా చేయగల సత్తా ఈ బ్యూటీకి ఉందని మేకర్స్ భావిస్తున్నారు.

మల్టీ టాలెంటెడ్ అయిన ప్రార్థనకు ఇంగ్లీష్, హిందీ, తమిళంతో పాటు సింధి భాషలోనూ అనర్గళంగా మాట్లాడే టాలెంట్ ఉంది. ఏవియేషన్ రంగం నుంచి నేరుగా సినిమాల్లోకి వస్తున్న కొత్త నటీనటుల్లో ఈమె రూటే సపరేట్ అని చెప్పాలి. భాషాపరంగా ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో, కోలీవుడ్ ఎంట్రీ తర్వాత ఈ బ్యూటీ టాలీవుడ్‌పై కూడా ఫోకస్ పెట్టే ఛాన్స్ ఉంది. సరైన అవకాశాలు వస్తే పాన్ ఇండియా రేంజ్‌లో రాణించి, సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ప్రార్థనా చాబ్రియా పక్కా ప్లానింగ్‌తో ముందుకు సాగుతున్నారు.

ఇవి కూడా చదవండి



ప్రార్థనా ఛాబ్రియా లేటెస్ట్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *