Headlines

Sanjeev Movie: ‘సంజీవ్’ నుంచి ఎమోషనల్ మెలోడీ ‘కలలకే’.. మూడో సింగిల్‌ను విడుదల చేసిన శైలేష్ కొలను | Kalalake Melody Song Released From Telugu Independent Film Sanjeev

Sanjeev Movie: ‘సంజీవ్’ నుంచి ఎమోషనల్ మెలోడీ ‘కలలకే’.. మూడో సింగిల్‌ను విడుదల చేసిన శైలేష్ కొలను | Kalalake Melody Song Released From Telugu Independent Film Sanjeev


తెలుగు ఇండిపెండెంట్ సినిమా ‘సంజీవ్’ ప్రమోషన్స్ జోరందుకున్నాయి. ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచిన ఈ చిత్రానికి సంబంధించిన మూడో సింగిల్ ‘కలలకే’ లిరికల్ వీడియో తాజాగా విడుదలైంది. ఈ ప్రత్యేకమైన మెలోడీని ప్రముఖ దర్శకుడు శైలేష్ కొలను ఆవిష్కరించారు. ‘కలలకే’ ఒక అందమైన ఎమోషనల్ మెలోడీగా నిలుస్తుంది. వినసొంపైన సంగీతం, హృదయాన్ని తాకే భావోద్వేగం, ఆహ్లాదకరమైన మెలోడీతో ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ‘సంజీవ్’ లోని భావోద్వేగ ప్రపంచాన్ని మరో కోణంలో పరిచయం చేసే పాటగా ‘కలలకే’ నిలుస్తుంది. ఈ చిత్రానికి అనిల్ నక్క రచన, దర్శకత్వం వహిస్తున్నారు. వీబీ సినిమా బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టీమ్ అప్పా ఈ ప్రాజెక్ట్‌ను ఎగ్జిక్యూట్ చేస్తోంది. ‘కలలకే’ పాటకు శివ శంకర్ చింతకింది సాహిత్యం అందించగా, జాన్ కె. జోసెఫ్ గానం, సంగీతాన్ని అందించారు. పాటను మధుర ఆడియో ద్వారా విడుదల చేశారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో గుర్తింపు పొందిన ‘సంజీవ్’, ఇప్పుడు OTT విడుదలకు సిద్ధమవుతోంది. ప్రముఖ తెలుగు OTT వేదిక ఆహాలో త్వరలో స్ట్రీమింగ్ కానుంది. కలలకే’ లిరికల్ వీడియో ప్రస్తుతం మ్యూజిక్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంది.

ఈ పాట విడుదల కార్యక్రమంలో చిత్ర నటులు హరీష్ పాలకుర్తి, వీర మనోహర్ కావలి, అచ్యుత్ జీఎస్, అభిజిత్ దాసరి, గీత రచయిత శివ శంకర్ చింతకింది, చిత్ర దర్శకుడు అనిల్ నక్క తదితరులు పాల్గొన్నారు. కాగా ‘సంజీవ్’ చిత్రం సుమారు 70 నిమిషాల నిడివితో తెరకెక్కింది. తెలుగు భాషలో రూపొందిన ఈ చిత్రాన్ని కేవలం నాలుగు రోజుల్లోనే పూర్తి చేశారు. పరిమిత వనరులు, తక్కువ బడ్జెట్ ఉన్నప్పటికీ.. కథపై నమ్మకంతో, అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా ఉపయోగించుకుంటూ చిత్రాన్ని కంప్లీట్ చేశారు.

సినిమా: ‘సంజీవ్’

ఇవి కూడా చదవండి



రచన & దర్శకత్వం: అనిల్ నక్క

నిర్మాణం: వీబీ సినిమా

ఎగ్జిక్యూషన్: టీమ్ అప్పా

సాహిత్యం: శివ శంకర్ చింతకింది

గానం & సంగీతం: జాన్ కె. జోసెఫ్

మ్యూజిక్: మధుర ఆడియో

OTT: ఆహా – త్వరలో

డైరెక్టర్ శైలేష్ కొలను చేతుల మీదుగా..

Sanjeev Movie Song Release

Sanjeev Movie Song Release

‘సంజీవ్’ మూవీ ఎమోషనల్ మెలోడీ ‘కలలకే’ లిరికల్ వీడియో..



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *