Headlines

Srikanth : శ్రీకాంత్ మేనకోడలు ఆ టాప్ హీరో భార్య అని తెలుసా.. ? పెళ్లికి మధ్య వర్తిత్వం చేసింది ఎవరంటే.. | Did you know Srikanth niece is the wife of that Tollywood Top hero, He Is Gopichand


ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో అమ్మాయిలలో అత్యధిక ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోలలో శ్రీకాంత్ ఒకరు. అప్పట్లో ప్రేమకథ చిత్రాలతోపాటు తన హెయిర్ స్టై్ల్ తోనూ చాలా ఫేమస్. తెలుగులో అనేక చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేసిన ఆయన ప్రస్తుతం యంగ్ హీరోల సినిమాల్లో సహాయ నటుడిగా కనిపిస్తున్నారు. అలాగే విలన్ పాత్రలలోనూ తనదైన అదరగొట్టేస్తున్నారు. ఇదెలా ఉంటే.. శ్రీకాంత్ తన వ్యక్తిగత జీవితం గురించి అంతగా మాట్లాడరు. తన పర్సనల్ లైఫ్, కుటుంబం గురించి ఎక్కడా ప్రస్తావించకుండా ఉంటారు. కానీ మీకు తెలుసా.. శ్రీకాంత్ మేనకోడలు తెలుగులో ఓ స్టార్ హీరో సతీమణి. అతడు మరెవరో కాదండి.. తెలుగు స్టార్ హీరో గోపిచంద్. గతంలో భీమ సినిమా ప్రమోషన్ల సమయంలో తన ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు గోపిచంద్.

ఎక్కువమంది చదివినవి : Nagarjuna : ఆయన తినే రైస్ మనం తినలేము.. నాగార్జున డైట్ రివీల్ చేసిన మేకప్ ఆర్టిస్టు..

శ్రీకాంత్ మేనకోడలి పేరు రేష్మ. ఓ వేడుకలలో తనను చూసిన మొదటి చూపులోనే ప్రేమలో పడిపోయారు గోపిచంద్. వీరిద్దరి వివాహం 2013లో ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు , సినీ ప్రముఖుల సమక్షంలో అత్యంత వైభవంగా జరిగింది. అయితే వీరిద్దరి పెళ్లి కుదరడానికి ప్రధాన కారణం ప్రముఖ దివంగత నటుడు చలపతిరావు అని గోపీచంద్ వెల్లడించారు. ఒక సందర్భంలో రేష్మ ఫోటోను చూసిన గోపీచంద్‌కు ఆమె నచ్చడంతో, ఆ తర్వాత ఆమె శ్రీకాంత్ మేనకోడలు అని తెలిసింది. అప్పటికే శ్రీకాంత్ తనకు మంచి పరిచయం ఉన్నప్పటికీ, నేరుగా వెళ్లి ఆ విషయం మాట్లాడటం మొహమాటంగా అనిపించిందట. దీంతో ఈ విషయాన్ని దివంగత నటుడు చలపతిరావు దృష్టికి తీసుకువెళ్లగా, ఆయనే స్వయంగా రంగంలోకి దిగి శ్రీకాంత్‌తో మాట్లాడి వివాహం నిశ్చయమయ్యేలా చేశారని గోపీచంద్ తెలిపారు. అంతేకాకుండా వివాహం దగ్గరుండి మరీ జరిపించడంలో చలపతిరావు కీలక పాత్ర పోషించారని ఆయన గుర్తుచేసుకున్నారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood: కొత్తింట్లోకి అడుగుపెట్టిన టాలీవుడ్ హీరోయిన్.. ఫ్యామిలీతో కలిసి గృహ ప్రవేశం.. ఫోటోస్ వైరల్..

ఇదే ఇంటర్వ్యూలో తన భార్య తనకు ఇచ్చిన మొదటి బహుమతి గురించి చెబుతూ.. రేష్మ తనకు తొలిసారిగా ఒక టీ-షర్ట్ , గ్రీటింగ్ కార్డును గిఫ్ట్‌గా ఇచ్చిందని సంతోషంగా పంచుకున్నారు. సినిమాల పరంగా వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న గోపీచంద్, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ మధుర జ్ఞాపకాలను అభిమానులతో పంచుకోవడం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

ఎక్కువమంది చదివినవి : Cinema : దేశాన్ని కుదిపేసిన నిజమైన సంఘటనతో తీసిన సినిమా.. ఓటీటీలో భయం పుట్టించింది.. ట్రెండింగ్‌లో నంబర్ వన్..

గోపిచంద్ పోస్ట్..

ఎక్కువమంది చదివినవి : Soundarya: సౌందర్య ఫస్ట్ సినిమా హీరో ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా.. ? 13 ఏళ్లకే స్టార్ డమ్.. ఇప్పుడు ఇలా..



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *