Headlines

Thalliki Vandanam: విద్యార్థులకు సూపర్ గుడ్‌న్యూస్.. రేపే అకౌంట్లోకి తల్లికి వందనం డబ్బులు! | AP Thalliki Vandanam: Rs 13,000 Aid for Govt School Students’ Mothers on July 22

Thalliki Vandanam: విద్యార్థులకు సూపర్ గుడ్‌న్యూస్.. రేపే అకౌంట్లోకి తల్లికి వందనం డబ్బులు! | AP Thalliki Vandanam: Rs 13,000 Aid for Govt School Students’ Mothers on July 22


తల్లికి వందనం పథకంపై కూటమి సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. విద్యార్థులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న తల్లికి వందనం పథకాన్ని బుధవారం అమలుచేసేందుకు ప్రభుత్వం అన్ని సిద్ధం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి పొరపాటు లేకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 64,76,590 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.13వేల నిధులు జమకానున్నాయి.

అయితే రాష్ట్రంలోని పేద విద్యార్థుల చదువులకు అండగా ఉండేందుకు కూటమి సర్కార్ ఈ తల్లికి వందనం అనే పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ఈ పథకం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న అర్హులైన ప్రతి విద్యార్థికి రూ.15వేల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది. అయితే ఈ మొత్తం రూ.15 నిధులను నేరుగా విద్యార్థి ఖాతాలో కాకుండా.. రూ.13వేలు విద్యార్థుల తల్లి అకౌంట్‌లో జమ చేయనుండగా.. మిగతా రూ.2వేలు విద్యార్థులు చదువుతున్న స్కూల్ అకౌంట్లో జమ చేయనున్నారు.

అయితే ఈ పథకం అమలుకు ముందు విద్యార్థులకు ప్రభుత్వం కొన్ని సూచనలు చేసింది. అకౌంట్లో డబ్బులు జమ కావాలంటే.. విద్యార్థి తల్లి ఖాతాకు కచ్చితంగా ఆధార్ లింక్ అయి ఉండాలని తెలిపింది. ఎవరైనా ఇంకా అకౌంట్‌కు ఆధార్ లింక్ లేకపోతే.. వెంటనే అప్‌డేట్ చేయించుకోవాలని సూచింది. అకౌంట్‌కు ఆధార్ లింక్‌ అయి లేకపోతే.. వారికి తల్లికి వందనం డబ్బులు జమ కాకపోవచ్చని తెలిపింది.

అలాగే పథకాన్ని అమలు చేస్తున్న వేళ లబ్ధిదారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. అకౌంట్లో డబ్బులు పడడాన్ని అవకాశాంగా చేసుకొని కొందరు సైబర్ నేరగాళ్లు సొమ్ము కాజేసే అవకాశం ఉందని కర్నూలు ఎస్పీ హెచ్చరించారు. విద్యార్థుల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోషల్ మీడియా ద్వారా వచ్చే మోసపూరిత లింకులపై క్లిక్ చేయవద్దని తెలిపారు. తెలియని వ్యక్తులకు ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్, ఓటీపీ వివరాలు చెప్పవద్దని తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *