Headlines

Tollywood : తెలుగులో 70కి పై సినిమాలు.. ఈ హీరోయిన్ మేనల్లుడు ఇప్పుడు క్రేజీ హీరో.. అమ్మాయిల డ్రీమ్ బాయ్.. | Actress Latha Sri Opens Up About Her Nephew Naga Shaurya and Tollywood Journey


ఒకప్పుడు తెలుగులో కథానాయికగా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్లలో లతా శ్రీ ఒకరు. తెలుగు, తమిళం, కన్నడ భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించింది. కథానాయికగానే కాకుండా సహయ నటిగా, విలన్ పాత్రలలోనూ అదరగొట్టింది. తెలుగులో యమలీల, నెంబర్ వన్, ఆ ఒక్కటీ అడక్కు, ముద్దుల మేనల్లుడు, అబ్బాయి గారు, పోలీస్ భార్య వంటి హిట్ చి్రాల్లో నటించింది. దాదాపు 70కి పైగా సినిమాల్లో నటించిన ఆమె ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, కెరీర్ గురించి పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ముఖ్యంగా తన మేనల్లుడు, హీరో నాగశౌర్యతో తన అనుబంధం గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడారు. ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ సపోర్ట్ లేకుండానే కేవలం ధైర్యంతో, తల్లి ప్రోత్సాహంతో అడుగుపెట్టానని ఆమె వివరించారు. తాను మంచిగా ఉండాలనే లక్ష్యంతోనే సినిమా ప్రపంచంలోకి వచ్చానని చెప్పారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ హీరో మాములోడు కాదు.. నెంబర్ వన్ ఫ్రాడ్.. సీనియర్ నటుడు సురేష్..

లతాశ్రీ తన కుటుంబ నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ, తన తాత సూరప్ నాయన ప్రభాకర రావు గారు ప్రముఖ నాటక కళాకారులని తెలిపారు. దీని వల్ల తన తల్లికి నటన పట్ల ఆసక్తి పెరిగిందని, ఆ తర్వాత తనకు డాన్స్ పట్ల ఎక్కువ మక్కువ ఏర్పడిందని అన్నారు. చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ప్రాణమని, మ్యూజిక్ వినిపిస్తే చాలు తన కాళ్లు ఆగవని ఆమె సంతోషంగా పంచుకున్నారు. క్లాసికల్‌తో పాటు వెస్ట్రన్ డాన్స్‌లో కూడా తన ప్రావీణ్యాన్ని వెల్లడించారు. స్ట్రీట్ ఫైటర్ వంటి కొన్ని చిత్రాలలో తన డాన్స్‌కు మంచి ప్రశంసలు లభించాయని, హీరోయిన్‌గా ఎందుకు చేయలేదని చాలా మంది అడిగేవారని గుర్తు చేసుకున్నారు. బాధ్యతలు, ప్రశాంతమైన జీవితం కోసమే క్యారెక్టర్, సిస్టర్ రోల్స్‌కు పరిమితమయ్యానని, వాటి ద్వారా సమాజంలో మంచి గౌరవం లభిస్తుందని నమ్మకంగా చెప్పారు.

ఎక్కువ మంది చదివినవి : Bigg Boss 10 Telugu : బిగ్‏బాస్‏లోకి ఈశ్వర సాయి, మాధురి రాథోడ్.. ఆది రెడ్డి చెప్పిందే నిజమవుతుందా.. ?

తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ, తనకు ఒక సొంత అన్నయ్య ఉన్నాడని, ఆయన సినీ నిర్మాత అని లతాశ్రీ తెలిపారు. తన పిల్లలు ఉన్నత చదువులు చదువుతున్నారని, చిన్న బాబు ఇంటర్‌లో ఉండగా, పెద్ద బాబు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్‌లో ఉన్నాడని అన్నారు. ఇంటర్వ్యూల కోసం ప్రత్యేకంగా చీర కట్టుకుని వస్తానని, సాధారణంగా ప్యాంట్లు, డ్రెస్సులు వేసుకుంటానని నవ్వుతూ చెప్పారు. తన చిన్నబాబుకు సినిమాలపై ఆసక్తి ఉందని, రక్తం లోనే అది ఉందని పేర్కొన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Sowcar Janaki: షావుకారు జానకి మనవరాలు తెలుగులో పెద్ద హీరోయిన్.. చాలా ఫేమస్.. ఎవరో

అత్యంత వివాదాస్పదంగా మారిన నాగశౌర్యతో తన బంధం గురించి లతాశ్రీ చాలా సున్నితంగా స్పందించారు. తాను నాగశౌర్య మేనత్త అని మీడియాలో ప్రచారం కావడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. “నాగశౌర్య వాళ్ళ మేనత్త లతాశ్రీ అని ఎవరు పెట్టరు. లతాశ్రీ వాళ్ళ మేనల్లుడు నాగశౌర్య అని పెడతారు. నేను ఇండస్ట్రీకి వచ్చి పేరు నిలబెట్టుకున్నా. నేను చెప్పుకోనప్పుడు, ఇతరులు చెప్పాల్సిన అవసరం లేదు” అని స్పష్టం చేశారు. వారి కుటుంబానికి ఇండస్ట్రీలో ఎవరూ లేరని నాగశౌర్య కుటుంబం చెబుతున్నప్పుడు, తాను వారి సంబంధాలను ఎందుకు చెప్పుకోవాలని ప్రశ్నించారు. మేనల్లుడు నాగశౌర్య సినిమాలు చూస్తానని, అతనిపై తనకు ప్రేమ ఉందని, అయితే చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉన్నాయని పేర్కొన్నారు. “మా అమ్మ ఉండంగా వెళ్ళేవాళ్ళం ఎక్కువ థియేటర్స్ కి” అని నాగశౌర్య సినిమా ఊహలు గుసగుసలాడే గురించి గుర్తు చేసుకున్నారు. తాను ఇప్పుడు పెద్దగా సినిమాలు చూడటం లేదని నిజాయితీగా వెల్లడించారు. తనకంటూ ఒక గుర్తింపును కాపాడుకోవాలని లతాశ్రీ తెలియజేశారు.

నాగశౌర్య పోస్ట్..

ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: రహస్య బావిలో మహిళ అరుపులు.. భయంతో వణికిపోవాల్సిందే.. ఓటీటీని ఊపేస్తున్న హారర్ థ్రిల్లర్..



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *