Headlines

Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీని పక్కన పెట్టాల్సిందే.. అజింక్య రహానే షాకింగ్ కామెంట్స్..! | Vaibhav suryavanshi dropped ajinkya rahane india afghanistan t20i


Vaibhav Suryavanshi Dropped: భారత్-అఫ్గానిస్థాన్ మధ్య తొలి టీ20 మ్యాచ్ సెప్టెంబర్ 13న జరగనుంది. ఈ సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీకి ప్లేయింగ్ 11లో చోటు దక్కుతుందా అనే చర్చ సాగుతోంది. ఇదే సమయంలో మాజీ భారత బ్యాటర్ అజింక్య రహానే తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. టీ20 ప్రపంచకప్‌లో ఆడిన టాప్-3 బ్యాటర్లనే కొనసాగించాలని, సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్‌లకు అవకాశం ఇవ్వాలని సూచించాడు. సూర్యవంశీకి కూడా సమయం వస్తుందని, ప్రస్తుతానికి మాత్రం అతడిని పక్కన పెట్టవచ్చని రహానే చెప్పుకొచ్చాడు.

రహానే సూచన ఇదే..

భారత్-అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌కు ముందు వైభవ్ సూర్యవంశీపై అజింక్య రహానే కీలక వ్యాఖ్యలు చేశాడు. తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడిన రహానే.. టీ20 ప్రపంచకప్‌లో ఆడిన టాప్-3 బ్యాటర్లనే అఫ్గానిస్థాన్ సిరీస్‌లోనూ కొనసాగించాలని అభిప్రాయపడ్డాడు.

ఎక్కువమంది చదివినది: బీబీఎల్‌లో హిస్టరీలోనే రికార్డ్ డీల్.. ఐపీఎల్ తోపుగాడిపై కోట్ల వర్షం..!

ఇవి కూడా చదవండి



అందులో భాగంగా సంజు శాంసన్‌ను మళ్లీ జట్టులోకి తీసుకుని అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేయించాలని సూచించాడు. ఇషాన్ కిషన్‌కు కూడా అవకాశం ఇవ్వాలని రహానే పేర్కొన్నాడు.

సూర్యవంశీ రికార్డు ఇదీ

ఇంగ్లాండ్‌తో జరిగిన T20 సిరీస్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ.. ఆ తర్వాత జింబాబ్వే సిరీస్‌లోనూ ఆడాడు. ఇప్పటివరకు ఆరు T20 మ్యాచ్‌లు ఆడిన అతను 32.16 సగటుతో 193 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధశతకాలు ఉన్నాయి.

అయితే ఈ గణాంకాలున్నప్పటికీ ప్రస్తుత సిరీస్‌లో అతడిని ప్లేయింగ్ XI నుంచి తప్పించాలని రహానే అభిప్రాయపడ్డాడు. సూర్యవంశీకి భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు వస్తాయని చెప్పాడు.

తొలి రెండు మ్యాచ్‌ల్లో బెంచ్‌పైనే..?

సూర్యవంశీని పూర్తిగా జట్టు నుంచి తప్పించే అవకాశం కంటే.. ప్రారంభ మ్యాచ్‌ల్లో అతడిని బెంచ్‌పై ఉంచే అవకాశమే ఉందనే చర్చ జరుగుతోంది. తొలి రెండు T20ల్లో అవకాశం రాకపోవచ్చని, మూడో మ్యాచ్‌లో ప్లేయింగ్ XIలోకి వచ్చే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో సూర్యవంశీని బ్యాకప్ ఓపెనర్ గా ఉపయోగించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఎక్కువమంది చదివినది: Viral Video: హర్మన్‌ప్రీత్ కౌర్ బ్యాక్‌ఫ్లిప్ క్యాచ్ వీడియో వైరల్.. అసలు విషయం ఇదే..!

అభిమానుల ఆసక్తి కూడా ఎక్కువే..

వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్‌ను చూడటానికి అభిమానుల్లో ఆసక్తి ఉంది. దులీప్ ట్రోఫీ సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌ల్లోనూ అతడి ఆటను చూసేందుకు ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

అందుకే భారత్-అఫ్గానిస్థాన్ సిరీస్‌లో టీమ్ మేనేజ్‌మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవైపు అనుభవజ్ఞులైన బ్యాటర్లకు రహానే మద్దతు ఇస్తుండగా.. మరోవైపు సూర్యవంశీకి అంతర్జాతీయ స్థాయిలో కొనసాగింపు దక్కుతుందా అనేది చూడాల్సి ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *