Headlines

Video: ఓర్నీ బుడ్డోడా.. నాగ్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెట్టగానే వైభవ్ చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే..! | Vaibhav suryavanshi nagpur airport video aunt feet player of the series zimbabwe

Video: ఓర్నీ బుడ్డోడా.. నాగ్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెట్టగానే వైభవ్ చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే..! | Vaibhav suryavanshi nagpur airport video aunt feet player of the series zimbabwe


Vaibhav Suryavanshi Nagpur Airport: జింబాబ్వే గడ్డపై ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తూ పరుగుల సునామీ సృష్టించిన వైభవ్, భారత క్రికెట్ భవిష్యత్తు ఆశాకిరణంగా మారాడు. ఎంతటి విజయాన్ని అందుకున్నా తన మూలాలను, సంస్కారాన్ని మర్చిపోలేదని ఈ సంఘటన నిరూపించింది. సిరీస్ వీరుడిగా స్వదేశానికి తిరిగి వచ్చిన అతనికి ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం లభించింది. ఆ సమయంలో ఎంతో ఆత్మీయంగా ముందుకొచ్చిన అత్తమ్మను చూడగానే ఎంతో వినయంతో ఆమె పాదాలకు నమస్కరించాడు.

నెటిజన్ల ఫిదా..!

ఈ దృశ్యానికి సంబంధించిన వీడియో ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వేగంగా వ్యాపించడంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. “పరుగులు తీయడం ఒక ఎత్తైతే.. పెద్దలను గౌరవించడం మరో ఎత్తు”, “ఇది కదా మన భారతీయుల సంస్కారం (సంస్కార్)” అంటూ వేలాది మంది నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వైభవ్ తల్లిదండ్రులు ఇచ్చిన పెంపకాన్ని, అతనికి ఉన్న క్రమశిక్షణను నెటిజన్లు ఆకాశానికెత్తుతున్నారు.

ఇవి కూడా చదవండి



ఇది కూడా చదవండి: ఐపీఎల్ ఆడకముందే టీమిండియాలోకి పిలుపు.. కట్ చేస్తే.. బెంచ్‌కే పరిమితమైన ఐదుగురు అన్ లక్కీ ప్లేయర్లు..!

భారత క్రికెట్‌లో కొత్త ఆశల వెలుగు!

చిన్న వయసులోనే అద్భుతమైన టాలెంట్‌తో ఆకట్టుకుంటున్న ఈ యువ ఆల్‌రౌండర్, రాబోయే రోజుల్లో టీమిండియాలో సుస్థిర స్థానం సంపాదించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మైదానంలో సిక్సర్లతో విరుచుకుపడే వైభవ్, వ్యక్తిగత జీవితంలో ఎంతటి నమ్రతతో ఉంటాడో ఈ ఒక్క సంఘటన స్పష్టం చేసింది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే సూత్రాన్ని పాటిస్తూ ముందుకు సాగుతున్న ఈ యంగ్ క్రికెటర్‌కు నెటిజన్లు, మాజీ క్రికెటర్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇది కూడా చదవండి: ఆ నలుగురు చెత్త ఫీల్డర్లను పీకేయండి.. ఇంకెన్నాళ్లు దాచిపెడతారు..: బీసీసీఐపై గవాస్కర్ ఫైర్..!

క్రీడా రంగంలో గెలుపోటములు సహజమే అయినా, ఆటగాడి వ్యక్తిత్వం, సంస్కారమే అతన్ని ఎక్కువ కాలం ప్రజల గుండెల్లో నిలబెడతాయి. వైభవ్ సూర్యవంశీ చూపించిన ఈ వినయం రాబోయే తరం యువ అథ్లెట్లకు ఎంతో ఆదర్శంగా నిలుస్తుంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *