Headlines

Viral Video: ఇంటిని రెనోవేట్ చేసేందుకు డ్రిల్లింగ్ పనులు.. కుప్పలు తెప్పలుగా బయటపడిన బంగారం! | Belgium Gold Treasure: 100 Crore Ancient Coins Found During House Renovation

Viral Video: ఇంటిని రెనోవేట్ చేసేందుకు డ్రిల్లింగ్ పనులు.. కుప్పలు తెప్పలుగా బయటపడిన బంగారం! | Belgium Gold Treasure: 100 Crore Ancient Coins Found During House Renovation


పాత ఇంటిని రెనోవెట్ చేస్తుండగా సుమారు 100 కోట్ల విలువైన బంగారు నాణెలు, బిస్కెట్లు బయటపడిన ఘటన బెల్జియంలోని ఈస్ట్ ఫ్లాండర్స్‌ వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. బెల్జియంలోని ఈస్ట్ ఫ్లాండర్స్‌ ఓ ఇంటి రెనోవేషన్ పనులు కొనసాగుతున్నాయి. అసైట్ కాంట్రాక్టర్ అయిన మారియో కొంతమంది కార్మికులను తీసుకొచ్చి వాళ్లకు డ్రైనేజీ పనులను అప్పగించారు. అయితే పైపులు వేసేందుకు కార్మికులు ఇంటి పునాదుల వద్ద డ్రిల్లింగ్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే ఆ డ్రింగ్‌ మిషన్‌కు ఏదో పుసుపు వర్ణం అంటుకున్నట్టు అనిపించింది.

అది చూసిన కార్మికులకు మొదట ఏం అర్థం కాలేదు. ఇలానే డ్రిల్ చేయడం కొనసాగించారు. అప్పుడే అక్కడ వారికి బంగారు నాణేలు, కడ్డీలు కనిపించాయి. దీంతో ఆశ్చర్యపోయిన కార్మికులు పూర్తిగా తవ్వి చూడగా మొత్తం 9 మిలియన్ల అంటే దాదాపు 100 కోట్ల విలువైన బంగారు నాణెలు, బిస్కెట్లు బయటకొచ్చాయి. ఈ నిధిని గుర్తించిన కార్మికులు వెంటనే సైట్ మేనేజర్ అయిన మారియోకు తెలిపారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న మోరియో.. వాటిని దాచడం దొంగతనం కిందకు వస్తుందని భావించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని పూర్తిగా తనిఖీ చేసి, బంగారాన్ని సురక్షితమైన ప్రదేశానికి తరలించారు. అలాగే ఇక్కడ బంగారం ఉందని తెలిస్తే మరిన్ని తవ్వకాలు జరిగే అవకాశం ఉందని.. అలా ఎవరైనా తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాదు బెల్జియం చట్టం ప్రకారం.. దొరికిన నిధికి అసలైన ఓనర్ ఎవరైనా ఉంటే 5 సంత్సరాల్లోపు వారు వచ్చి క్లెయిమ్ చేసుకోవాలని.. లేదంటే ఈ నిధికి ఎలాంటి నేర చరిత్ర లేదని తేలితే.. సివిల్ చట్టం ప్రకారం.. ఆ ప్లేస్ ఓనర్‌, ఆ నిధిని కని పెట్టిన కార్మికులకు సగం సగం పంచి పెట్టే అకాశం ఉందని తెలిపారు.

ప్రస్తుతానికి ఈ భారీ నిధి ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు దాచారు? అనే విషయాలను తెలుసుకోవడానికి స్థానిక పోలీసులు సైట్ మేనేజర్‌తో పాటు కార్మికులు ప్రశ్నిస్తున్నారు. అలాగే ఇతర అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.

వీడీయో చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *