Headlines

అమెరికాలో టాలీవుడ్‌కు అక్షయపాత్ర ఖాళీ.. ఓవర్సీస్ మార్కెట్ ఎందుకిలా డౌన్? | Why Is Tollywood’s Overseas Market Cooling Down Trump Policies, OTT Impact and Rising Risks video – Entertainment Videos in Telugu

అమెరికాలో టాలీవుడ్‌కు అక్షయపాత్ర ఖాళీ.. ఓవర్సీస్ మార్కెట్ ఎందుకిలా డౌన్? | Why Is Tollywood’s Overseas Market Cooling Down Trump Policies, OTT Impact and Rising Risks video – Entertainment Videos in Telugu


ఒకప్పుడు టాలీవుడ్‌కు కాసుల వర్షం కురిపించిన ఓవర్సీస్ మార్కెట్ ఇప్పుడు ఎందుకిలా చల్లబడిపోయింది..? ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు సినిమాల ఫ్యూచర్‌ను కూడా డిసైడ్ చేస్తున్నాయా..? మునుపటిలా రేట్లు పెట్టి సినిమాలు చూసే పరిస్థితి ప్రస్తుతం అక్కడ లేదా..? బ్రేక్ ఈవెనే గగనమైపోతున్న ఈ సిచ్యువేషన్‌లో.. ఓవర్సీస్ బయ్యర్లను బతికించడానికి ఏం చేస్తున్నారు..? చూద్దామా ఎక్స్‌క్లూజివ్‌గా.. ఒకప్పుడు ఓవర్సీస్ మార్కెట్ అంటే టాలీవుడ్‌కు అక్షయ పాత్ర. బాహుబలి 2 లాంటి సినిమాకు 20 మిలియన్ డాలర్లు వస్తే.. పుష్ప 2, RRR, కల్కి అక్కడ్నుంచే 15 మిలియన్లకు పైగా కలెక్ట్ చేసాయి. చిన్న సినిమాలకు 7 నుంచి 12 డాలర్లు.. పెద్ద సినిమాలకు ఏకంగా 24 డాలర్లు పెట్టినా ఆడియన్స్ క్యూ కట్టి మరీ చూసేవాళ్లు.. కానీ ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయిపోయి కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. ఓవర్సీస్ మార్కెట్ డౌన్ అమెరికాలో ప్రస్తుతం ఉన్న రాజకీయ, ఆర్థిక పరిస్థితులే ప్రధాన కారణమని తెలుస్తుంది. అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, పెడుతున్న ఆంక్షలతో మనోళ్ల ఉద్యోగాలపై ఎఫెక్ట్ పడుతుంది.. దాంతో సినిమాలపై ఖర్చు చేయడానికి జంకుతున్నారు. ఇక ఓటీటీల ఎఫెక్ట్, పెరుగుతున్న ఖర్చులు కూడా తోడవడంతో.. మునపట్లా ఎంతపడితే అంత రేట్ పెట్టి గుడ్డిగా సినిమాలు చూడట్లేదు వాళ్లు. ఈ 2026లో టాలీవుడ్‌కు సరైన బ్లాక్‌బస్టర్ లేకపోవడం కూడా ఓవర్సీస్ బయ్యర్లను భయపెడుతుంది. మన శంకరవరప్రసాద్ గారు సినిమా అటూ ఇటుగా బ్రేక్ ఈవెన్ అవ్వగా.. సమంత నటించిన మా ఇంటి బంగారం మాత్రమే ఓవర్సీస్‌లో మంచి లాభాలు తెచ్చింది. ఇక మనమిక్కడ హిట్ అంటున్న లెనిన్, నారినారి నడుమ మురారి, చెన్నై లవ్ స్టోరీ, అనగనగా ఒకరాజు లాంటి సినిమాలేవీ ఓవర్సీస్‌లో భారీ లాభాలేం తేలేదు. రామ్ చరణ్ పెద్దికి కూడా ఓవర్సీస్‌లో నష్టాలు తప్పలేదు. అమెరికాలో తెలుగు సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయడం అంటే జూదం ఆడినట్లే అని బయ్యర్లు భయపడుతున్నారు. అద్భుతమైన కంటెంట్ ఉండి, రీజనబుల్ రేట్లకు సినిమాను కొంటే తప్ప లాభాలు కళ్లచూసే పరిస్థితి లేదక్కడ. కనీసం ఈ ఏడాది రాబోయే రామాయణ, టాక్సిక్, ప్యారడైజ్, విశ్వంభర లాంటి సినిమాలతో అయినా పరిస్థితులు చక్కబడతాయేమో చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్లాస్టిక్‌ కరెన్సీపై కేంద్రం క్లారిటీ.. ఇక పేపర్‌ నోట్లు బంద్‌?

అంతరిక్షంలోకి 13.5 లక్షల మంది పేర్లు.. నాసా సరికొత్త ప్రయోగం!

డెన్మార్క్ రాజకుమారి సంచలనం.. రాయల్ లైఫ్ వదిలి మిలిటరీలోకి ప్రిన్సెస్ ఇసాబెల్లా!

మీ రేషన్ కార్డ్ స్మార్ట్‌కార్డ్‌గా మారబోతోంది.. ఆగస్టు 15న పంపిణీ

హైదరాబాద్‌లో అతిపెద్ద క్రైసిస్.. ఇళ్లు వదిలి పారిపోతున్న పిల్లలు.. తప్పు ఎక్కడ జరుగుతోంది?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *