Headlines

ఈ వారం విడుదలవుతున్న సినిమాలేంటో తెలుసా..? | Three Way Box Office Clash This Week: Jana Nayagan, Chennai Love Story and The India Story video tv9d – Entertainment Videos in Telugu

ఈ వారం విడుదలవుతున్న సినిమాలేంటో తెలుసా..? | Three Way Box Office Clash This Week: Jana Nayagan, Chennai Love Story and The India Story video tv9d – Entertainment Videos in Telugu


గత రెండు వారాలుగా బాక్సాఫీస్ బాగానే కళకళలాడుతుంది.. లెనిన్ పుణ్యమా అని ఓ వారం.. ఒడిస్సీ పుణ్యమా అని మరో వారం కలెక్షన్ల వర్షం కురిసింది. ఇప్పటికీ ఒడిస్సీ దూకుడు నడుస్తూనే ఉంది. ఈ వారం నోలెన్‌కు పోటీ ఇచ్చేందుకు మరో మూడు సినిమాలు వచ్చేస్తున్నాయి. లాంగ్ అవైటెడ్ సీఎం గారి చిత్రం కూడా ఇదే వారం వస్తుంది. మరి ఆ సినిమాలేంటో చూసేద్దామా..? లెనిన్, ది ఒడిస్సీ కారణంగా రెండు మూడు వారాలుగా థియేటర్స్ అన్నీ బాగానే కళకళలాడుతున్నాయి. ఇదే జోరు కంటిన్యూ చేయడానికి ఈ వారం మూడు సినిమాలు వస్తున్నాయి. అందులో జన నాయకుడే ముందున్నాడు. జూలై 23న విడుదలవుతుంది ఈ చిత్రం. భగవంత్ కేసరి రీమేక్‌గా వస్తున్న జన నాయకుడు.. తెలుగులో ఏ మేర ప్రభావం చూపిస్తుందనేది ఆసక్తికరమే. జన నాయకుడికి తెలుగులోనూ స్క్రీన్స్ భారీగానే ఇచ్చారు. మరోవైపు విజయ్‌కు పోటీగా కిరణ్ అబ్బవరం దిగుతున్నారు. ఈయన నటించిన చెన్నై లవ్ స్టోరీ జూలై 24న విడుదల కానుంది. అయితే 23 సాయంత్రమే పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నారు. బేబీకి కలిసొచ్చిన ప్రీమియర్స్.. చెన్నై లవ్ స్టోరీకి వర్కవుట్ అవుతుందని నమ్ముతున్నారు మేకర్స్. సాయి రాజేష్ ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు రాసారు. బేబీని రిలీజ్ తర్వాత కల్ట్ అంటే.. చెన్నై లవ్ స్టోరీని మాత్రం విడుదలకు ముందే కల్ట్ లవ్ స్టోరీ అని ప్రమోట్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలకు పోటీగా కాజల్ నటించిన ది ఇండియా స్టోరీ జూలై 24నే రానుంది. పెస్టిసైడ్స్, వాటి సైడ్ ఎఫెక్ట్స్ నేపథ్యంలో మోస్ట్ కాంట్రవర్సియల్ సబ్జెక్ట్‌తో వస్తుంది ఇండియా స్టోరీ. మొత్తానికి ఈ మూడింట్లో ఈ వారం ఏ సినిమా సత్తా చూపిస్తుందో చూడాలిక.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యారా.. ఈ 5 లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి!

భారతీయులకు నిద్ర కరవు.. షాకింగ్ నిజాలు!

మనుషులను చల్లబరిచే ఫ్రిజ్‌.. లోపల 5 నిమిషాలు కూర్చుంటే చాలు

40 అడుగుల ఎత్తు నుంచి పడ్డ టూరిస్ట్! ఏం జరిగిందో మీరే చూడండి!

Tirumala: అన్నప్రసాదాల పంపిణీకి కొత్త టెక్నాలజీ టీటీడీ వినూత్న ప్రయోగం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *