కొన్నేళ్లుగా సమ్మర్ సీజన్‌ను చేజేతులా వదిలేస్తున్నారు మన మేకర్స్. కారణమేదైనా కానీ హాలిడేస్‌ను క్యాష్ చేసుకోవడంలో దారుణంగా విఫలమవుతున్నారు. మూడేళ్లుగా సమ్మర్ అంతా ఖాళీగానే వదిలేస్తున్నారు. కానీ 2027 మాత్రం సీన్ మరోలా ఉండబోతుంది. వచ్చే ఏడాది వేసవి బాగా కాస్ట్లీగా ఉండబోతుంది.. ఏకంగా 3500 కోట్ల బిజినెస్ కళ్ల ముందు కనిపిస్తుంది. మరి అదెలాగో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దామా..? సమ్మర్ సీజన్ అంటే ఒకప్పుడు పెద్ద సినిమాలతో కళకళలాడిపోయేది. కానీ రెండు మూడేళ్ళుగా ఐపిఎల్ పేరు చెప్పి అసలు సినిమాలు విడుదల చేయడమే ఆపేసారు మేకర్స్. ఈ ఏడాది కూడా పెద్ది మినహా పెద్ద సినిమాలేవీ సమ్మర్లో రాలేదు. మన సినిమాలు లేకపోయేసరికి.. ధురంధర్ 2, వీరభద్రుడు, దృశ్యం 3 లాంటి డబ్బింగ్ సినిమాలే ఈ సమ్మర్‌ను క్యాష్ చేసుకున్నాయి. 2027 సమ్మర్ మాత్రం అలా కాదు.. చూస్తుంటే మోస్ట్ కాస్ట్లీయెస్ట్ సమ్మర్‌గా 2027 నిలవబోతుందనిపిస్తుంది. కొన్నేళ్లుగా సమ్మర్ సీజన్‌ను వదిలేస్తున్న స్టార్ హీరోలు వచ్చే ఏడాది మాత్రం పట్టుకుంటున్నారు. 3 నెలల్లోనే 3500 కోట్ల బిజినెస్ కళ్ల ముందు కనిపిస్తుంది. 2027 సమ్మర్‌ను మార్చి 5న స్పిరిట్‌తో ప్రభాసే రిబ్బన్ కట్ చేయబోతున్నారు. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది. స్పిరిట్ షూటింగ్ ఇప్పటికే 40 శాతం పూర్తైందని తెలిపారు సందీప్ రెడ్డి వంగా. ఈయన అనుకున్న టైమ్‌కే సినిమాను తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. స్పిరిట్ బిజినెస్ రేంజ్ 1200 నుంచి 1500 కోట్ల మధ్యలో ఉంది. అలాగే ఏప్రిల్ 7న వారణాసితో రాజమౌళి రానున్నారు. ఈ మధ్య కాలంలో ఫస్ట్ టైమ్ వాయిదాల్లేకుండా చెప్పిన తేదీకే సినిమా విడుదల చేసేలా ఉన్నారు జక్కన్న. వారణాసి బిజినెస్ రేంజ్ ఎలా ఉందో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన పనిలేదు. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2000 కోట్లు ఈ సినిమాకు పెద్ద కష్టమేం కాకపోవచ్చు. అలాగే జూన్ 11న డ్రాగన్ రానుంది. 2027 సమ్మర్లో రాబోయే లాస్ట్ పెద్ద సినిమా ఇదే. ప్రశాంత్ నీల్ ఈ ప్రాజెక్ట్‌ను ఇంటర్నేషనల్ రేంజ్లో తెరకెక్కిస్తున్నారు. మొత్తానికి 3 నెలల గ్యాప్‌లో మూడు భారీ సినిమాలతో సమ్మర్ 2027 నెక్ట్స్ లెవల్లో కనబడుతుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వైరల్ ఇన్ఫెక్షన్కు గురయ్యారా.. ఈ 5 లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి!
భారతీయులకు నిద్ర కరవు.. షాకింగ్ నిజాలు!
మనుషులను చల్లబరిచే ఫ్రిజ్.. లోపల 5 నిమిషాలు కూర్చుంటే చాలు
40 అడుగుల ఎత్తు నుంచి పడ్డ టూరిస్ట్! ఏం జరిగిందో మీరే చూడండి!
Tirumala: అన్నప్రసాదాల పంపిణీకి కొత్త టెక్నాలజీ టీటీడీ వినూత్న ప్రయోగం