Headlines

చేతకాకనే చిల్లర మాటలు.. కాంగ్రెస్‌ది థర్డ్ క్లాస్ పాలన: కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు.. | BRS Chief KCR Slams Revanth Reddy Government, Calls Congress Rule a Failure


సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. చిల్లర మాటలు మాట్లాడుతున్నారు.. పాలన చేతకాక బూతులు మాట్లాడుతున్నారు.. కాంగ్రెస్ 1000 డేస్ పాలన అట్టర్ ఫ్లాప్‌ అంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో మాట్లాడిన మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ అసెంబ్లీలో, బయట బూతులు మాట్లాడుతున్నారని.. పాలన చేతగాక ఈ తరహాలో వ్యవహరిస్తున్నారంటూ కేసీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలన అట్టర్ ఫ్లాప్‌ అని ఆరోపించారు. కాంగ్రెస్‌ది థర్డ్ క్లాస్ పాలన అని.. ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి ఖాయమన్నారు. ఈ విషయం ఆ పార్టీ నేతలకు అర్థమైందని.. అందుకే ఈ దోపిడీ అని విమర్శించారు. సభలో స్పీకర్ పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారన్నారు.

అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ సభ్యులంతా తప్పకుండా హాజరుకావాలన్నారు కేసీఆర్. శాసనసభ, మండలిలో జరిగే ప్రతి చర్చలో పాల్గొనాలని సూచించారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పార్టీ అధినేత కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో చర్చించారు కేసీఆర్. కాంగ్రెస్, BJP విధానాలను ఉభయ సభల్లో ఎండగట్టాలని సూచించారు. స్పీకర్‌ పక్షపాత వైఖరి అప్రజాస్వామికమని కేసీఆర్ పేర్కొన్నారు.

కాగా.. సాగునీటి ప్రాజెక్ట్‌లపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. 22Aపైనా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యూహరచన చేస్తోంది. అసెంబ్లీకి రాని కేసీఆర్ రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్‌ డిమాండ్ చేస్తున్న క్రమంలో.. కాంగ్రెస్ వ్యూహానికి కౌంటర్‌ అస్త్రాలు సిద్ధం చేస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *