Headlines

విమానంలో ప్రయాణికుడి హంగామా.. సీటుకు టేప్‌తో చుట్టేసిన సిబ్బంది! | Man duct taped to seat on flight after alleged racist outburst


జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించిన ఒక నల్లజాతి విమాన సిబ్బందిని ఉద్దేశించి  జాతి వివక్షను సూచించే పదజాలంతో దూషించాడు.  ఆ తర్వాత ఈ వివాదం కాస్తా భౌతిక దాడికి దారితీసింది. సదరు వ్యక్తి తన పక్క సీట్లో కూర్చున్న ప్రయాణికుడిపై దాడి చేసి, అతని కంప్యూటర్‌ను ధ్వంసం చేశాడని ఆరోపణలు వచ్చాయి. సహాయం చేయడానికి ప్రయత్నించిన ఒక మహిళను కూడా అతను తోసేసినట్లు సమాచారం.

విమానంలో పరిస్థితి మరింత తీవ్రం కావడంతో, తోటి ప్రయాణికులు, విమాన సిబ్బంది జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. విమానంలో గొడవ జరుగుతున్న సమయంలో అక్కడే ఉన్న రిచర్డ్ ఓలెనిక్, జువాన్ మెజియా అనే మాజీ పోలీసు అధికారులు అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ప్రయాణికుడు గొడవ చేయకుండా, సీటు నుంచి కదలకుండా విమాన సిబ్బందితో కలిసి అతడి శరీరం, చేతుల చుట్టూ గట్టిగా డక్ట్ టేప్ చుట్టి కట్టేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు వైరల్ గా మారాయి.  అతని చేతులను జిప్ టైస్‌తో కట్టేసి, ఆ తర్వాత అతను సీటు నుంచి కదలకుండా డక్ట్ టేప్‌తో గట్టిగా బిగించి కట్టేశారు. 

ఈ ఘటనతో అప్రమత్తమైన పైలట్లు, అత్యవసరంగా విమానాన్ని మేరీల్యాండ్‌లోని బాల్టిమోర్ విమానాశ్రయానికి దారి మళ్లించారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే భద్రతా సిబ్బంది, పోలీసులు రంగంలోకి దిగి  నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత విమానం తిరిగి బయలుదేరి గమ్యస్థానమైన నెవార్క్‌కు చేరుకుంది.

సదరు వ్యక్తిని 67 ఏళ్ల అరిజోనా వాసి ఆర్థర్ లూండీన్‌గా గుర్తించారు. మేరీల్యాండ్‌లోని  అరుండెల్ కౌంటీలో సెకండ్ డిగ్రీ అసాల్ట్ (దాడి కేసు), అల్లకల్లోలం సృష్టించడం (డిజార్డర్లీ కండక్ట్) కింద కేసులు నమోదు చేశారు. అరెస్టు చేసిన తర్వాతి రోజు సెప్టెంబర్ 4న లూండీన్ బెయిల్‌పై విడుదలయ్యాడు. అక్టోబర్ 19వ తేదీన మరోసారి న్యాయస్థానం ఎదుట హాజరుకావాల్సి ఉంది.

విమానంలో ప్రయాణికుడిని టేప్‌తో కట్టేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో  విమానంలో ఇలాంటి ఘటనలు జరగడం పట్ల నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. గాల్లో ఉండగా ప్రయాణికుల నుంచి ఇటువంటి హింసాత్మక ఘటనలు ఎదురుకావడం విమాన భద్రతపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతోందని అభిప్రాయపడ్డారు.

మరో వైపు, కస్టమర్ల భద్రతకే ప్రాధాన్యత ఇస్తామని అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. విమానాల్లో హింసాత్మక ప్రవర్తనను, భద్రతకు భంగం కలిగించే చర్యలను ఏ మాత్రం సహించబోమని ఎయిర్‌లైన్స్ యాజమాన్యం తేల్చిచెప్పింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *